షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ షేర్ చేసిన న్యూడ్ ఫొటో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. గౌరీ ఖాన్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన ఖాతాల ద్వారా ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలనూ ప్రస్తావిస్తుంది. వీటిని షారూఖ్ అభిమానులు తమ ఫ్యాన్ పేజీలలో షేర్లు చూస్తూ ఉంటారు . 

న్యూడ్ పెయింటింగ్ ఫొటో

తాజాగా గౌరీ ఖాన్ తన ఇంటిలో ఉన్న న్యూడ్ ఫొటో పెయింటింగ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు.. ఓ మహిళను అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది. అంతేకాదు, వాళ్లు ఆమెను చిత్ర హింసలకు గురి చేసేటట్లు కనిపిస్తోంది. ఈ ఫొటో తమ ఇంటిలోని ఇంటీరియల్ డిజైన్‌ను మరింత అందంగా చూపిస్తుందని గౌరీ ఖాన్ పేర్కొంది. 


గౌరీ ఖాన్ షేర్ చేసిన ఫొటోపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘న్యూడ్ ఫొటోలు షేర్ చేసే ముందు ఒక్కసారి కాదు.. కొన్ని లక్షల సార్లు ఆలోచించాలి' అని ఒకరు సలహా ఇవ్వగా.. ‘ముగ్గురు పిల్లల తల్లివి. వాళ్ల ముందు ఇలాంటి ఫొటోలు పెట్టుకుని ఎలా ఉంటున్నారు..?' అని మరొకరు ప్రశ్నించారు. ఇలా చాలా మంది ఎన్నో రకాలుగా గౌరీ ఖాన్‌ను విమర్శిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: