ఇస్మార్ట్ శంకర్ నిన్న మొదటి సోమవారం కలక్షన్స్ పరీక్షలో కూడ పాస్ అవ్వడంతో ఈమూవీ హవా ‘డియర్ కామ్రేడ్’ మూవీ రిలీజ్ అయ్యేదాకా కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. దీనితో ఈసినిమాకు 30 కోట్లకు పైగా నెట్ కలక్షన్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. 

ఇది ఇలా ఉంటే ఈమూవీ కథ తనది అంటూ ఒకనాటి హీరో ఆకాష్ ఇప్పుడు మీడియాకు ఎక్కడం హాట్ టాపిక్ గా మారింది. చాల సంవత్సరాల క్రితం విడుదలైన శ్రీను వైట్ల ‘ఆనందం’ మూవీలో ఆకాష్ హీరోగా నటించాడు. ఆతరువాత ‘ఆనందం ఆనందమాయే’ లాంటి కొన్ని సినిమాలలో నటించినా ఆ సినిమాలు అన్నీ వరస ఫ్లాప్ లుగా మారడంతో ప్రస్తుతం ఈ హీరో తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. 

అయితే ఇతడి కెరియర్ ఇంకా తమిళ సినిమాలలో కొనసాగుతోంది. 2015లో వచ్చిన ‘నాన్ యార్’ మూవీ కథను తాను వ్రాసానని ఆకథను మక్కీకి మక్కీగా కాపీ చేసి పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ తీసాడు అనీ ఆకాష్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు ఈమూవీని తెలుగులో తాను త్వరలో ‘కొత్తగా ఉన్నాడు’ పేరుతో డబ్ చేసి విడుదల చేస్తున్న విషయాన్ని వివరిస్తూ ‘ఇస్మార్ట్ శంకర్’ వల్ల తనకు నష్టం కలిగింది అని అంటున్నాడు. 

వాస్తవానికి పూరీ ఈమూవీ మూల కథను ఒక బ్రిటీష్ థ్రిల్లర్ మూవీ నుండి కాపీ చేసాను అన్న విషయం ఓపెన్ గానే చెప్పాడు. అయితే ఇప్పుడు ఏకంగా ఆకాష్ రంగంలోకి దిగి తన మూవీ కథను పూరీ కాపీ చేసాడని అతడికి లీగల్ నోటీసులు పంపుతున్నాను అని అనడంతో పూరీ ఎన్ని సినిమాల కథలను కాపీ కొట్టి ‘ఇస్మార్ట్ శంకర్’ ను తీసాడు అన్న సందేహాలు కలుగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: