కొరటాల శివకు టాప్ హీరోలతో సినిమాలు తీసి కేవలం వారిని మాస్ హీరోలుగా కాకుండా చాల డిఫరెంట్ గా చూపించగల శక్తీ ఉన్న దర్శకుడు. అందువల్లనే ఇప్పటి వరకు కోరటాలకు పరాజయం అన్న పదం దరి చేరలేదు. దీనితో అతడితో సినిమాలు చేయాలని చాలామంది టాప్ హీరోలు ప్రయత్నించినా కొరటాల మాత్రం ఇప్పటి వరకు మహేష్ ప్రభాస్ జూనియర్ లతో మాత్రమే సినిమాలు తీసాడు.

ఇలాంటి పరిస్థుతులలో కొరటాల చిరంజీవి కోసం ఒక సంవత్సరం వేచి ఉండి మొదలు పెడుతున్న మూవీ షూటింగ్ వచ్చే నెల చిరంజీవి పుట్టినరోజునాడు ప్రారంభం కాబోతోంది. ఈమూవీని అత్యంత వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఉగాది రోజున విడుదల చేసి ఆ ఏడాది సమ్మర్ రేస్ ను మొదలు పెట్టాలని కొరటాల భావిస్తున్నాడు. 

ప్రస్తుతం కొరటాల చిరంజీవితో తీస్తున్న సినిమా మొదలు కాకుండానే కొరటాలతో ఒక వైపు జూనియర్ మరొక వైపు విజయ్ దేవరకొండలు రాయబారాలు చేస్తున్నట్లు సమాచారం. విజయ్ తో సినిమా చేయాలని అనేక మంది దర్శకులు ప్రయత్నిస్తున్నా అతడి దృష్టి మాత్రం కొరటాల శివ పై ఉన్నట్లు టాక్.

ఇక జూనియర్ కొరటాల మధ్య సాన్నిహిత్యం ఈనాటిది కాదు. ‘బృదావనం’ సినిమా నుండి వీరి మైత్రి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపధ్యంలో వచ్చే ఏడాది ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ పూర్తి అయిన వెంటనే కొరటాలతో సినిమా చేస్తానని జూనియర్ రాయబారం నడిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం ఇంకా తేలకుండానే విజయ్ దేవరకొండ కొరటాల అంగీకరిస్తే తానే ఒక సినిమాను కొరటాల దర్శకత్వంలో నటిస్తూ తానునిర్మించడమే కాకుండా ఆ ప్రాజెక్ట్ లో కొరటాలకు మేజర్ షేర్ ఇస్తాను అంటూ నడుపుతున్న రాయబారాల మధ్య కొరటాల జూనియర్ విజయ్ ల మధ్య వచ్చే సంవత్సరం ఎవరి వైపు మొగ్గు చూపుతాడు అన్న విషయమై ఇప్పటి నుంచే అంచనాలు మొదలైపోయాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: