అంజలి అంటే తెలుగింటి అమ్మాయి గుర్తుకు వస్తుంది; సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో అచ్చం సీతలాగానే కనిపించి మురిపించింది.ఆ మూవీతో తెలుగు వారింట ఆడపడుచుగా మారిపోయింది. అంజలి లో గొప్పతనం ఏంటి అంటే అందం ప్లస్ అభినయం. ఈ రెండూ ఉన్నా ఎందుకో అమ్మడికి ఆఫర్లు మాత్రం పెద్దగా  రావడంలేదు.


సరైన పాత్ర తగిలితే నా సత్తా చూపిస్తాను అంటున్న అంజలి బాలయ్యతో డిక్టేటర్ లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. గీతాంజలి అంటూ హారర్ జోనర్లో కూడా తన సత్తా చాటుకుంది. చిత్రంగద పేరు మీద లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసినా కలసి రాలేదు. ఇవన్నీ ఇలా ఉంటే తన అందం ఎక్కడికీ పోలేదని అంజలి చెప్తోంది.


లేటెస్ట్ గా ఫోటో షూట్లతో కుర్ర కారు మతి పోగొడుతోంది. తాను రేసులోనే ఉన్నానంటూ సవాల్ విసురుతోంది. అంజలి కి ఆఫర్లు దీంతోనైనా వస్తాయా అన్నది చూడాలి. వస్తే మాత్రం ఈ అమ్మడు మరో మారు టాలీవుడ్ ని కుమ్మేయడం ఖాయమని అంటున్నారు. సో అంజలి అదరగొట్టే అందం అభినయం చూసే అవకాశం ఏ నిర్మాత ఇస్తారో మరి. 



మరింత సమాచారం తెలుసుకోండి: