టాలీవుడ్‌లో `ఉయ్యాల జంపాల` చిత్రంతో హీరోగా కెరియ‌ర్ స్టాట్ చేసిన రాజ్ త‌రుణ్ ప్రారంభంలో హిట్లు అందుకున్నా.. ప్ర‌స్తుతం మాత్రం వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్నాడు. కుమారి 21F తో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రాజ్ త‌రుణ్‌ తాజాగా మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి తెర మీద‌కు రాబోతున్నాడు. 


ఇక గుండెజారి గల్లతయ్యిందే, ఒకలైలా కోసం సినిమాలతో అలరించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా - రాజ్ త‌రుణ్ కాంబినేష‌న్లో  ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ఇంట్ర‌స్టింగ్ క్యారెక్ట‌ర్‌లో రాజ్ త‌రుణ్ క‌నిపింబోతున్నాడు.  రాజ్ తరుణ్ ఓ ఏజ్ బార్ ఆంటీతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ సినిమా స్టోరీ ప్ర‌కారం రాజ్ ఓ ఆంటీ ప్రేమ‌లో ప‌డ‌తాడ‌ని తెలుస్తోంది. 


అలాగే ఈ సినిమాలో ఈ క్యారెక్ట‌ర్ కోసం ఓ సీనియ‌ర్ హీరోయిన్ న‌టిస్తుంద‌ట‌. మ‌రా సీనియ‌ర్ హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. రాజ్ త‌రుణ్ సినిమాలు చేస్తున్నా ... తాను అనుకున్న స్థాయిలో ఫ‌లితాలు రావ‌డం లేదు. ప్ర‌స్తుతం ఈ ఇంట్ర‌స్టింగ్ క‌థ‌తో రాబోతున్న రాజ్ త‌రుణ్ మ‌రి ఇప్ప‌టికైనా హిట్ కొడ‌తాడో? లేదో? చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: