పూరి జగన్నాధ్ మరియు చార్మీ కౌర్ ఇటీవల విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ పార్టీలో బిజీగా ఉన్నారు- ఎనర్జెటిక్ స్టార్  రామ్ పోతినేని, నభా నటేష్ మరియు నిధి అగర్వాల్ నటించిన ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రం జూలై 18 న విడుదలై బాక్సాఫీస్ వద్ద బరిలో నిలిచింది.

విడుదలకు ముందే పూరి జగన్నాధ్ హాలీవుడ్ చిత్రం 'ఐబాయ్' నుండి సిమ్ మార్పిడి ఐడియాని తీసుకున్నారని వార్తలు వచ్చినప్పటికి పూరి దానిని ఖండించారు. అతను హాలీవుడ్ చిత్రం నుండి కాన్సెప్ట్‌ను తీసుకున్నారని చెప్పినప్పటికీ సినిమా పేరును వెల్లడించలేదు.

నటుడు జై ఆకాష్ దర్శకుడిపై కేసు నమోదు చేయడంతో ఇప్పుడు మరోసారి పూరి జగన్నాధ్ ఇబ్బందుల్లో పడ్డాడు. అతని మాటల ప్రకారం ఇస్మార్ట్ శంకర్  మెదడు ట్రాంస్ప్లాంట్ యొక్క కాన్సెప్ట్ అతని 2015 తమిళ చిత్రం ‘నాన్ యార్’ నుండి కాపీ చేయబడింది. నాన్ యార్ తెలుగులో ‘కోత్తగా ఉన్నాడు’ గా విడుదల కానున్నట్లు జై ఆకాష్ తెలిపారు.


జై ఆకాష్  శ్రీను వైట్ల 'ఆనందం'  మరియు 'ఆనందమానందమయే' ద్వారా తెలుగు సినిమాకి పరిచయం అయ్యాడు. “ఇస్మార్ట్ శంకర్ చూసిన తరువాత, నేను షాక్ అయ్యాను మరియు నేను పూరి జగన్నాధ్, చార్మీ కౌర్లతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు, వారు నాకు సరిగా స్పందించలేదు. కాబట్టి నేను తమిళ చిత్ర నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశాను. అవసరమైతే, న్యాయం కోసం చట్టబద్ధంగా కొనసాగడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: