విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తెచ్చిన సినిమా అర్జున్ రెడ్డి.. ఆ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ శాలినీపాండే లిప్ కిస్ లు కూడా సంచలనంగా మారాయి.


విజయ్ దేవరకొండ రాబోయే చిత్రం డియర్ కామ్రేడ్ లో కూడా ముద్దు సన్నివేసాలు సంచలనం సృష్టించే అవకాశం ఉంది. మొన్నటికి మొన్న సాయి పల్లవి కూడా విజయ్ దేవరకొండతో ముద్దు సన్నివేశాల కారణంగానే సినిమా ఒప్పుకోలేదని కామెంట్ చేసినట్టు వార్తలు వచ్చాయి.


ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తన సినిమాలో ముద్దులపై క్లారిటీ ఇచ్చాడు. ముద్దు సన్నివేశాలు ఉంటేనే సినిమాలు ఆడతాయని తానెప్పుడూ అనుకోలేదట. ముద్దులన్నీ కథలో భాగమేనట.


ఓ ఫైటింగ్ సీన్ తీసేటప్పడుు రౌడీలపై నాకేం పగ ప్రతీకారాలు ఉండవు. వాళ్లని కొట్టడం నటన మాత్రమే. ముద్దు కూడా అంతేనట. ఈ సినిమాలో తెరపై బాబీ, లిల్లీ అనే ఇద్దరు ముద్దులు పెట్టుకుంటారు. విజయ్‌, రష్మికలు కాదు.. అంటూ క్లారిటీ ఇచ్చాడు విజయ్.


మరింత సమాచారం తెలుసుకోండి: