సినిమాల్లో హీరోయిన్లు నగ్నంగా నటించడం కొత్తేమీ కాదు.. కథ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించడానికి ప్రోఫెషనల్ హీరోయిన్లు కూడా పెద్దగా అభ్యంతరపెట్టరు. దీనికితోడు కథానుగుణంగా నటిస్తే నటిగానూ మంచి మార్కులే వస్తాయి.


అయితే ఇలా హీరోయిన్లు నగ్నంగా నటించే సీన్లు సాధారణంగా సినిమాలో ఒకటో, రెండో ఉంటాయి. అవే కథలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒకటీ, అరా సీన్లు కాబట్టి వాటిలో నటించడమూ హీరోయిన్లకు అంతగా ఇబ్బంది ఉండదు. కానీ .. ఒక సినిమాలో సెకండ్ హాఫ్ అంతా నగ్నంగా నటించడం అంటే మాటలా..?


ఇప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్.. అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన ఆమె సినిమాలో అమలాపాల్ సెకండ్ హాఫ్ అంతా నగ్నంగానే కనిపిస్తుందట. అయితే హీరోయిన్ నగ్నంగా ఉన్నా.. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా జాగ్రత్తపడ్డాడట డైరెక్టర్.


అందుకే ఇప్పుడు అమలాపాల్ నటకు ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రతి అమ్మాయి, వాళ్ల తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా అంటూ విమర్శకులు మెచ్చుకుంటున్నారు. అయితే సినిమా విడుదల ఆలస్యం కావడంతో ఫలితం కాస్త నిరాశ పరుస్తోంది. ఏదేమైనా అమలాపాల్ డేరింగ్ కు మెచ్చుకోవాల్సిందే సుమా.


మరింత సమాచారం తెలుసుకోండి: