స‌హ‌జంగా హీరోయిన్లు కెమెరా మీద క‌నిపించాలంటే తెరవెనుక చాలా పెద్ద బాగోతం నడవాల్సిందే. ఇటీవ‌ల కాస్టింగ్ కౌచ్ అనే ప‌థం ఇండ‌స్ట్రీని ఊపేస్తోంది. టాలీవుడ్‌లో జరుగుతున్న చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక్క టాలీవుడ్‌లోనే కాదు దేశ‌వ్యాప్తంగా అన్ని సినిమా ప‌రిశ్ర‌మ‌ల‌లోనే ఈ తంతు న‌డుస్తూనే ఉంది. ఎంతో మంది హీరోయిన్లు లైంగిక వేధింపులు ఎలా ఎదుర్కొన్నారో బ‌య‌టకు వ‌చ్చి చెబుతున్నారు. 


ఇలా ఒక్కొక్కరుగా టాలీవుడ్‌లో జరుగుతున్న  అవకాశాల పేరుతో వాడుకోవడం గురించి నోరు విప్పుతున్నారు. ఇక తాజాగా త‌న అందాల‌తో ఆక‌ట్టుకుంటున్న క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మిక‌కు ఇదే ప‌రిస్థితి ఎదురైంది. చాలా రంగాల్లో అమ్మాయిలను ఎక్స్ ప్లాయిట్ చేయడం అన్నది ఉంది. ఆఖరికి అది క్రీడారంగంలో కూడా ఎదుర‌వుతుంది. ర‌ష్మిక‌కు కూడా ఓ కోచ్ నుంచి లైంగిక వేధింపుల‌కు గురైంద‌ట‌. అయితే ఇది త‌న నిజ జీవితంలో కాదు.. తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఆమె కొత్త సినిమా డియర్ కామ్రేడ్ లో ఈ పాయింట్ ను చూపించ‌బోతున్నారు.


ర‌ష్మిక ఈ సినిమాలో క్రికెటర్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఆమెకు కోచ్‌ నుంచి లైంగిక వేధింపులు గుర‌వుతాయ‌ని, వాటిని ఎలా ఎదుర్కొంటుంది? అన్న‌ది కాస్త డీప్‌గానే డిస్క‌స్ చేసిన‌ట్టు టాక్‌. ఈ సిపిమా కీల‌క భాగం ఈ వ్య‌వ‌హారం చుట్టు తిరుగుతుంద‌ట‌. మ‌రి ఈ సినిమా ఎలా ఉండ‌బోతుందో ఈ శుక్రువారం వ‌ర‌కు వేచి చూడాల్సిందే..  


మరింత సమాచారం తెలుసుకోండి: