బిగ్ బాస్ హౌస్ కి ప్రధాన ఆకర్షణ ఏమిటంటే హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలే అన్నది తెలిసిందే. ఈ గొడవల కారణంగానే షో కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ప్రతిక్షణం హౌస్ లో జరిగే వివాదాలను ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ ఉంటారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ -3 ఎంతో ఆసక్తికరంగా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున తొలి రోజు తన ఎనర్జిటిక్ యాంక‌రింగ్‌తో ఎక్కడ లేని క్రేజ్ తీసుకు వచ్చాడు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో చూస్తే హౌస్ లో హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.


బిగ్ బాస్ సూచన మేరకు హేమను మానిటర్ గా కొందరు ఎంచుకున్నారు. అందరూ ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అంద‌రూ గౌరవించాలి. ఈ క్ర‌మంలోనే హౌస్ లో రూల్స్ విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తుంది. మానిట‌ర్ హేమ‌కు హిమ‌జ‌కు గొడ‌వ జ‌రిగింది. హిమజ మాట్లాడుతూ వాళ్ళు ఆర్డర్లు వేసినప్పుడు రూల్స్ మీకు గుర్తుకు రాలేదా అంటూ హేమతో వాదనకి దిగింది. 


హిమ‌జ త‌న‌కు ఎదురు తిర‌గ‌డంతో షాక్‌కు గురైన హేమ ఇది నా డెసిషన్..నేను ఏమైనా రాంగ్ అయితే జనాలు నన్ను తిడుతారు అనటంతో, మీరు నిందలు యాక్సెప్ట్ చేస్తారో నేను చేయను అంటూ హిమజ సీరియ‌స్ అవుతుంది. వెంట‌నే హేమ మీ ఇష్టం అంటూ ప‌క్క‌కు వెళ్లిపోతుంది. ఓవ‌రాల్‌గా ఈ ఎపిసోడ్ హాట్ హాట్ మాట‌ల‌తో చాలా ఇంట్ర‌స్టింగ్‌గానే న‌డుస్తుంద‌ని ప్రోమో చెప్పేస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: