రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ వ‌సూళ్ల జోరుకు బ్రేకుల్లేవు. గురువార‌మే ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రావ‌డంతో ఏకంగా నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ క‌లిసి వ‌చ్చింది. వీకెండ్ డేస్‌తో పాటు వీక్ డేస్‌లోనూ శంక‌ర్ మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. సోమ‌వారం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ 2.2 కోట్ల షేర్ రాబ‌ట్టింది.


మొత్తం ఐదు రోజుల‌కు గాను ఏకంగా 22.80 కోట్ల షేర్‌తో ఇప్ప‌టికే లాభాల్లోకి ఎంట‌ర్ అయిపోయింది. ఈ సినిమాను రూ.18 కోట్ల‌కు అమ్మ‌గా ఇప్ప‌టికే లాభాల భాట ప‌ట్టేసింది. వ‌చ్చే వారం రిలీజ్ అయ్యే డియ‌ర్ కామ్రేడ్ సినిమా వ‌ర‌కు ఈ సినిమా జోరును ఆప‌డం క‌ష్ట‌మే. ఫ‌స్ట్ వీక్‌కే ఇస్మార్ట్ నిర్మాత‌లు, బ‌య్య‌ర్ల‌కు భారీ లాభాలు రానున్నాయి.


ఇస్మార్ట్ 5 డేస్ ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్ : (రూ.కోట్ల‌లో)


నైజాం - 9.79


సీడెడ్  - 4.03


నెల్లూరు - 0.79


కృష్ణ - 1.44


గుంటూరు - 1.47


వైజాగ్ - 2.62


ఈస్ట్ - 1.46


వెస్ట్ - 1.20
-------------------------------------
ఏపీ + టీస్ షేర్ = 22.80
-------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: