ఇప్పటివరకు తెలుగు టెలివిజన్ తెరపై ప్రసారం అయిన బిగ్ బాస్ షో రెండు సీజన్లూ మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. మొదటి సీజన్ కు ఎన్టీఆర్, రెండవ సీజన్ కు నాని హోస్టులుగా వ్యవహరించి షోని మంచి సక్సెస్ చేసి మరింత పేరు తీసుకురావడం జరిగింది. ఇక ప్రస్తుతం అక్కినేని నాగార్జున హోస్ట్ గా ప్రసారం అవుతున్న ఈ సీజన్ పై కూడా వీక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అంతేకాక తొలిరోజు ఈ షోకు అత్యధిక స్థాయిలో టిఆర్పి రేటింగ్స్ వచ్చినట్లు సమాచారం. 

ఇకపోతే ఈ బిగ్ బాస్ మూడు సీజన్లు మంచి సక్సెస్ఫుల్ గా ముందుకు సాగడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది అంటూ నేడు ఉదయం నుండి ఒక వార్త పలు మీడియా మద్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే, షో మొదటి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ పేరులోని మొదటి ఇంగ్లీష్ అక్షరం ఎన్, ఇక రెండవ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన నాని పేరులోని మొదటి ఇంగ్లీష్ అక్షరం ఎన్, అలానే ప్రస్తుతం మూడవ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున పేరులోని మొదటి ఇంగ్లీష్ అక్షరం ఎన్ కావడమే ఈ షో సక్సెస్ అవడానికి కారణం అనే కొత్త వాదన ప్రచారం అవుతోంది. అయితే వాస్తవానికి నాగార్జున, 

నాని పేర్లు ఎన్ తో మొదలైనప్పటికీ ఎన్టీఆర్ పూర్తి పేరు నందమూరి తారక రామారావు కాబట్టి అయన పేరులోని మొదటి అక్షరంగా ఎన్ ను తీసుకున్నట్లు చెప్తున్నారు. మరి ఇది యాదృచ్చికమో లేక కావాలనే ఈ విధమైన అక్షరాల పేర్లు గల హీరోలను హోస్టులుగా తీసుకోవాలని బిగ్ బాస్ టీమ్ ఏమైనా ప్రణాళికలు రచించిందా అనే విషయాలు మాత్రం ఆ భగవంతుడికె తెలియాలని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇవన్నీ ప్రక్కన పెడితే, ప్రస్తుతం మంచి జోష్ తో సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 3, మాత్రం రాబోయే రోజుల్లో మరింత రసవత్తరంగా సాగనున్నట్లు అర్ధం అవుతోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: