విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు గారి నటవారసుడిగా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ, తండ్రి ఎన్టీఆర్ గారి పేరు మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లారనే చెప్పాలి. ఇక వారి వంశంలో మూడవతరం హీరోలుగా ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు నందమూరి కల్యాణ రామ్ లు వారి వంశ పేరు, ప్రతిష్టలను మరింత పటిష్టం చేశారనే చెప్పాలి. 

ఇకపోతే నందమూరి బాలకృష్ణ గారి నటవారసుడిగా అయన కుమారుడు మోక్షజ్ఞ త్వరలో సినిమా అరంగేట్రం చేయనున్నట్లు గకొద్దినెలలుగా సినిమా వర్గాల్లో విపరీతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మోక్షజ్ఞకు మాత్రం సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని, అలానే అయన బిజినెస్ మ్యాన్ గా స్థిరపడాలని అనుకుంటున్నట్లు ఇటీవల కొన్ని మీడియా మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. మరి బాలకృష్ణ గారి వారసుడిగా మోక్షజ్ఞ అసలు సినిమాల్లోకి వస్తారా లేదా అనేదానిపై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత లేకపోవడంతో నందమూరి అభిమానులు కొంత నిరాశ చెందుతోంది మాత్రం వాస్తవం అనే చెప్పాలి. 

అయితే అయన సినిమా ఎంట్రీ విషయమై నేడు మరొక వార్త విశేషంగా వైరల్ అవుతోంది. మిగతా అందరు తల్లిదండ్రుల వలె, బాలకృష్ణ కూడా తన బిడ్డల ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదని, ఆ విధంగా మోక్షజ్ఞకు సినిమాలపై పెద్దగా ఆసక్తిలేదని తెలియడంతో, బాలకృష్ణ కూడా దానిని పాజిటివ్ గా తీసుకుని అతడిని తనకు ఇష్టమొచ్చిన రంగాన్ని ఎంచుకోమని చెప్పారట. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఇదే కనుక నిజం అయితే, మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం ఎంతో అతృతతో ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు ఇది ఒకరకంగా కొంత చేదు వార్తే అని చెప్పాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: