విజయదేవరకొండ సినిమాలో మళ్ళీ రష్మిక రిపీట్ అయ్యే సరికే వారి మధ్య ఎదో ఉందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే అలాంటిదేం లేదంటోంది రష్మిక. ఇంకా సూటిగా ఆమె మాటల్లో చెప్పాలంటే విజయ్ కు అంత సీన్ లేదంటోందీమె. "విజయ్ దేవరకొండకు అంత సీన్ లేదు. డియర్ కామ్రేడ్ లో నా క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నాను. విజయ్ కోసం కాదు. గీతగోవిందం సినిమా పెద్ద హిట్. నేను ఒప్పుకుంటాను. కానీ డియర్ కామ్రేడ్ కు ఓకే చెప్పడానికి కారణం అది కాదు. డియర్ కామ్రేడ్ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది.


భరత్ నాకు స్క్రిప్ట్ పంపించాడు. అది చదవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక ఆపలేదు. అంత బాగా నచ్చింది. అందుకే ఒప్పుకున్నాను." పనిలోపనిగా విజయ్ దేవరకొండతో ముద్దుసీన్లపై కూడా రియాక్ట్ అయింది. గీతగోవిందంలో ముద్దు సీన్ హిట్ అయింది కాబట్టి, డియర్ కామ్రేడ్ లో ముద్దు సీన్ పెట్టలేదంటోంది. కథ డిమాండ్ చేసింది కాబట్టి లిప్ లాక్ సీన్ పెట్టారని చెప్పుకొచ్చింది. "ట్రయిలర్ లో కేవలం ముద్దు సీన్ గురించే మాట్లాడుకుంటే అది వాళ్ల ఆలోచనకే వదిలేస్తున్నా.


సినిమా యాంగిల్ లో కూడా చూసేవాళ్లు ఉంటారు కదా. ఏదైనా జనాల మైండ్ సెట్ లోనే ఉంటుంది. మా వరకు మేం మాత్రం రెండుపాత్రలు పోషించాం. అందులో భాగంగా ముద్దులు పెట్టుకున్నాం." ప్రస్తుతానికైతే తన మనసులో ఎవరూ లేరని స్పష్టంచేసింది రష్మిక. చాలా ఏళ్లుగా సింగిల్ గానే ఉన్నానని, ప్రస్తుతానికి సినిమాలు, జిమ్ తోనే టైమ్ అంతా అయిపోతోందని.. డేటింగ్ కు అస్సలు టైమ్ దొరకడం లేదంటోంది రష్మిక. కొన్నిసార్లు టైమ్ లేక భోజనం చేయడం కూడా మరిచిపోతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: