ప్రభాస్, అనుష్క ఈ రెండు పేర్లు వినగానే అబ్బా ఎంత మంచిగా ఉంది సౌండు అని అనుకుంటారు నెటిజన్లు. కారణం ప్రభాస్, అనుష్క సినిమాలో నటించే తీరు, ఒకరిని ఒకరు తిట్టుకోవడం, ప్రేమ చూపించుకోవడం ప్రేక్షకులు బాగా నచ్చేస్తుంది. అందుకే ప్రభాస్, అనుష్క అభిమానులు అంత వారి పెళ్లి జరగాలని కోరుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే వారి పెళ్లి టాపిక్ మళ్ళి తెరపైకి వచ్చింది. 


ఈరోజు ప్రభాస్ ఇంస్టాగ్రామ్ వేధికగా 'హేయ్ డార్లింగ్స్' అంటూ పిలిచి సాహూ నుంచి శ్రద్ధ కపూర్, అతను ఉన్న రొమాంటిక్ ఫోటోని విడుదల చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు కొన్ని క్షణాల్లోనే ఆ ఫోటోని నెట్టింట్లో వైరల్ చేశారు. ప్రభాస్ పెట్టిన ఫోటోకి కొన్ని లక్షల్లో లైకులు వచ్చాయి, కొన్ని వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఆ సమయంలోనే ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ 'సాహూ హిట్ అవుతే అనుష్కతో పెళ్లి అంటా కదా ప్రభ' అని కామెంట్ చేశారు. 


ఈ కామెంట్ కి మరి కొంతమంది అభిమానులు స్పందిస్తూ 'అనుష్కతో పెళ్లి అవుతుందో అవ్వదో కానీ ప్రభాస్ 'సాహూ' సినిమా హిట్ అవ్వకుంటే' ప్రభాస్ కి పెళ్లి అభిమానులే చేస్తారు' అంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ కామెంట్ కాస్తా ప్రస్తతం వైరల్ అవుతుంది. కాగా ప్రభాస్ సాహూ సినిమాతో బిజీగా ఉండగా, అనుష్క 'నిశ్శబ్దం' అనే చిత్రంతో 'నిశ్శబ్దంగా' పని చేసుకుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: