పెళ్లి చూపులు చిత్రంతో మంచి విజయం సాధించిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు డియర్ కామ్రెడ్ చిత్రంతో ఈ శుక్రవారం బాక్స్ఆఫీస్ ముందుకు వస్తున్నాడు. గతంలో గీతాగోవిందం చిత్రంలో నటించిన రష్మిక మందన ఈ చిత్రంలో కూడా నటిస్తుంది. అయితే వీరి కాంబినేషన్ తో సినిమా విజయం సాధించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు విజయ్ నటించిన అన్ని సినిమాలు హిట్టే.

ఈ నెల 26న సౌత్ లోని అన్ని ప్రధాన భాషలలో విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అలాగే “డియర్ కామ్రేడ్” టీం సౌత్ ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలలో మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించి వినూత్న ప్రచారం కలిపించడం జరిగింది. కాగా “డియర్ కామ్రేడ్” తెలుగులో వచ్చే శుక్రవారం పోటీ ఏమి లేకుండా సోలోగా విడుదల అవుతుంది.

తమిళనాడులో జులై 26న “డియర్ కామ్రేడ్” తో కలుపుకొని మొత్తం 7 సినిమాలు విడుదల కానున్నాయి. అంటే డియర్ కామ్రేడ్ కు తీవ్ర పోటీ తప్పడం లేదు. వీటిలో తమిళంలో స్టార్ కమెడియన్ అయిన సంతానం నటించిన “ఏ1”, అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన “కొలైయుధిర్ కాలం” తో పాటు దర్శకుడు సముద్ర ఖని నటించిన “కొలాంజి”, అలాగే “నుంగంబాకం”,”చెన్నై పళని మార్స్”, “ఆరడి” అనే చిత్రాలు ఉన్నాయి.

ఇలా మొత్తం ఆరు సినిమాలతో విజయ్ దేవరకొండ చిత్రం పోటీపడాల్సివస్తుంది. వీటిలో ఏ1,కొలైయుధిర్ కాలం తప్పా మిగిలిన సినిమాలేవి  విజయ్ సినిమాకు అంతగా అడ్డురావు. అవన్ని చిన్న సినిమాలు కావడంతో చిత్రబృందం కాస్తాం ఊరట కలిగించనుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా,జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: