వాల్మీకి.. ఇప్పుడు ఈ సినిమా గురించి తెలుగు ఇండ‌స్ట్రీలో బాగాన చ‌ర్చ జ‌రుగుతుంది. ముఖ్యంగా ప్రీ టీజ‌ర్ చూసిన త‌ర్వాత దీని గురించి మాట్లాడుకునేలా చేసాడు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్. ఇక ఇప్పుడు ఈ చిత్ర రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. 


ఈ సినిమా కోసం హరీష్ శంకర్ కూడా కొత్త దారులు వెతుక్కుంటున్నాడు. అయినా టాలీవుడ్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త పుంత‌లు తొక్కుతూనే ఉంది. అప్ప‌ట్లో ట్రైల‌ర్ ఉండేది.. ఆ త‌ర్వాత టీజ‌ర్ వ‌చ్చింది.. ఆ త‌ర్వాత ఏవేవో పేర్ల‌తో కొత్త కొత్త వీడియోలు విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 


సినిమాపై ఆస‌క్తి పెంచ‌డానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ ఫాలో అవుతున్నారు. హ‌రీష్ శంక‌ర్ ఈ మ‌ధ్య ప్రీ లుక్ టీజ‌ర్ విడుదల చేసాడు. ఇక ఇప్పుడు మ‌రో పోస్ట‌ర్ రిలీజ్ చేసి విడుద‌ల తేదీపై కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 13న విడుదల కానుంది. వ‌రుణ్ తేజ్ హీరోగా వ‌స్తున్న ఈ చిత్రం త‌మిళ‌నాట హిట్ అయిన జిగ‌ర్తాండ సినిమాకు రీమేక్. 


ఇందులో నెగిటివ్ కారెక్ట‌ర్ చేస్తున్నాడు వ‌రుణ్ తేజ్. త‌మిళ హీరో అథ‌ర్వ ముర‌ళి మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్. డిజే త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తుంది. ఆ మ‌ధ్య వ‌చ్చిన ప్రీ టీజ‌ర్లో వ‌రుణ్ తేజ్ లుక్ చూసి నిజంగానే భ‌యం వేస్తుంది. మ‌రి రేపు సినిమాలో ఇంకెలా ఉంటాడో..? 


మరింత సమాచారం తెలుసుకోండి: