మోడల్ రంగం నుంచి ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. మొదటి సినిమాతోనే హాట్ హాట్ అందాలతో అదరగొట్టిన ఈ బ్యూటీ.. ఆ తరువాత ధోని బయోపిక్ ఏంఎస్ ధోనితో మంచి హిట్ కొట్టింది. ధోని సినిమా సమయంలో చేసిన నెట్ ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ వెబ్ సీరియస్ కాకపుట్టించింది.
అందులో అనేక బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయి. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా.. బెరుకు లేకుండా నటించి మెప్పించింది. ఈ సిరీస్ తో మరింత పేరు వచ్చింది. దీంతో ఆమెకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చింది.
భరత్ అనే నేను సినిమాలో గ్లామర్ కు చోటు లేకున్నా... అక్కడక్కడా స్పేస్ తీసుకొని గ్లామర్ షో చేసింది. సినిమా హిట్ కొట్టడంతో తెలుగులో రామ్ చరణ్ తో సినిమా ఛాన్స్ వచ్చింది. తీరా చూస్తే ఆ మూవీ భారీ ప్లాప్. రెండు సినిమాలతో కియారా తెలుగుకు స్వస్తి పలికి బాలీవుడ్ కు వెళ్ళింది.
తెలుగులో సూపర్ హిట్టైంది అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించారు. ఈ మూవీ సూపర్ హిట్టైంది. కథతో పాటు కియారా ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా ముద్దులు ఇచ్చింది. ఈ ముద్దులే సినిమాకు కలెక్షన్ల వర్షానికి హద్దులు లేకుండా చేశాయి.
సినిమా హిట్ తరువాత మరింత రెచ్చిపోయింది. రెడ్ కలర్ డ్రెస్ లో కనువిందు చేసింది. డ్రెస్ నెక్ భాగంలోని వి షేప్ ఎంతలా ఉందంటే.. అది చెప్పడం కంటే చూస్తేనే బాగా అర్ధం అవుతుంది. గ్లామర్ కు ఈ స్థాయిలో ప్రోత్సాహం ఇస్తుంటే.. ఆఫర్లు రాకుండా ఎందుకుంటాయి. హీరోయిన్ల తెలివి అంటే అదే మరి.