విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా డియర్ కామ్రేడ్. ఈ నెల 26 న ప్రేక్షకుల  ముందుకు రాబోతోంది. ఇప్పటికే ట్రైలర్స్, సాంగ్ ప్రోమొస్ తో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. సాధారణంగా కాస్టింగ్ కౌచ్...కేవలం సినిమాల వరకే ఈ పదం వాడుతూ వుండొచ్చు. కానీ చాలా రంగాల్లో అమ్మాయిలను ఎక్స్ ప్లాయిట్ చేయడం వుందన్న సంగతి అందరికి తెలిసిందే. ఆఖరికి క్రీడారంగంలో కూడా. అవకాశాలు కావాలంటే, తమను సంతృప్తి పరచాలనే నీచమైన వ్యాపకం, వ్యవహారం దాదాపు చాలా రంగాల్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి.

ఆ పాయింట్ ను కూడా డియర్ కామ్రేడ్ సినిమాలో డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది.డియర్ కామ్రేడ్ లో హీరోయిన్ రష్మిక క్రికెటర్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆమెకు కోచ్ నుంచి ఎటువంటి లైంగిక వేధింపులే ఎదురవుతాయని, వాటిని కాస్త డీప్ గానే డిస్కస్ చేసినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సినిమాలో కీలకభాగం ఈ సమస్య చుట్టూ, దాని పరిణామాల చుట్టూ తిరుగుతుందని ఒక తాజా వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

కామ్రేడ్ సినిమాలో క్యాంపస్ రాజకీయాలు, స్టూడెంట్ యూనియన్ల వ్యవహారాలు వుంటాయన్న సంగతి ఈ సినిమా ట్రైలర్స్ చూస్తే అర్థమవుతోంది. అలాగే ఈ కోచ్ ల వేధింపులు కూడా అన్నమాట. అయితే కేవలం అలా ఓ కాలేజీ స్టోరీ అల్లకుండా, దీని మధ్య ఓ ప్రేమకథను ఇమిడ్చినట్లు కనిపిస్తోంది. భరత్ కమ్మ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించారు. ఇక జూలై 26 న ఈ సినిమా థియోటర్స్ లోకి వస్తోంది. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ ఫుల్ కలెక్షన్ల తో దూసుకుపోతోంది. మరి కామ్రేడ్ ఎలాంటి సక్సస్ ను అందుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: