రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ హీరో విజయ్ దేవరకొండ కు సవాల్ విసిరాడు . రేపు మాజీ మంత్రి , యువ నాయకులు కేటీఆర్ పుట్టినరోజు కావడంతో ఈ సవాల్ విసిరాడు . ఒక్క విజయ్ దేవరకొండ కు మాత్రమే కాకుండా దర్శకులు వంశీ పైడిపల్లి అలాగే హీరో నితిన్ , మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత లకు సవాల్ విసిరాడు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ .


ఇంతకీ ఈ సవాల్ ఏంటంటే కేటీఆర్ పుట్టిన రోజున సమాజ హితం కోసం ఏదైనా ఓ మంచి కార్యక్రమం చేయాలనీ పిలుపు ఇవ్వడమే ! కేటీఆర్ అన్న అంటే సంతోష్ కు అమితమైన అభిమానం దాంతో కీసర గుట్ట లోని 2042 ఎకరాల అటవీ భూములలో దత్తత తీసుకున్నాడు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ . ఆ ప్రాంతం మొత్తాన్ని తన సొంత ఖర్చులతో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేసాడు సంతోష్ కుమార్ . ఇక ఈ సవాల్ ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించాడు దర్శకుడు వంశీ పైడిపల్లి . మరి విజయ్ దేవరకొండ ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి .


ఇక పోతే, విజయ్ దేవరకొండ నటించిన 'డియర్ కామ్రేడ్' జులై 26 కి దక్షిణాది లో ఉన్న నాలుగు భాషల్లో రిలీజ్ కి సిద్ధం గా ఉంది. అలానే, ఇవాళ ఆ చిత్రం తాలూకు పాటలు అన్నిటిని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అంటూ, సినిమా కూడా బ్లాక్బస్టర్ అని ఫాన్స్ ఫిక్స్ అయిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: