దివంగత ముఖ్యమంత్రి  జయలలిత  జీవితం ఆధారంగా,  బాహుబలి రైటర్  విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో  తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ 'తలైవి'  అనే టైటిల్ తో  అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ బయోపిక్ లో  జయలలిత పాత్రలో  బాలీవుడ్ క్వీన్  కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం తమిళం కూడా నేర్చుకుంటుంది ఈ బాలీవుడ్ క్వీన్.  ఇక విజయేంద్ర ప్రసాద్ కథ రాసే ముందు  జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానాన్ని కూడా కథలో హైలెట్ చేస్తూ కథ రాశారట.  


 ముఖ్యంగా  ఒక హీరోయిన్ని  ఒక రాష్ట్రం మొత్తం అమ్మగా భావించడానికి గల కారణాలు ఏమిటి..? తమిళ  రాజకీయాలను  జయలలిత ఎలా శాసించారు ? అతి సామాన్యమెన వ్యక్తులకి టికెట్లు ఇచ్చి ఎలా గెలిపించుకోగలిగారు ? లాంటి అంశాలను  ప్రధానంగా తీసుకోని  ఈ స్క్రిప్ట్  రాశారట. అసలు కంగనాను సీఎంగా చూస్తారా..?  అయితే జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే  కంగనా రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు పూర్తి  న్యాయం జరుగుతుంది. మరి జయలలిత పాత్రను  కంగనా రనౌత్ ఎలా మెప్పిస్తోందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: