యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రూపొందుతున్న బిగ్గెస్ట్ సెన్సేషనల్ మూవీ సాహో. దేశవ్యాప్తంగా విపరీతమైన అంచనాలున్న ఈ సినిమాను ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇటీవల సినిమా నిర్మాతలైన యువి క్రియేషన్స్ వారు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు రిలీజైన సైకో సైయ్యా సాంగ్ మంచి సక్సెస్ సాధించడంతో యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే కొద్దిరోజుల క్రితం విడుదలైన ఆ సాంగ్ పై కొంత నెగటివ్ టాక్ కూడా నడిచింది. 

సైకో సయ్యా పల్లవితో సాగిన ఆ సాంగ్ లోని పదాలు ఎవ్వరికీ కూడా అర్ధం కానీ విధంగా పాట సాగుతుందని, అంతేకాక సంగీత దర్శకుడు ఇచ్చిన మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదని ప్రచారం సాగింది. వాస్తవానికి ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన తనిష్క్ బాగ్చి  ఆకట్టుకునే సాంగ్స్ ఇచ్చారని సినిమా యూనిట్ అంటోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు బడా టాలీవుడ్ సంగీత దర్శకులే మన వాళ్ళని ఆకట్టుకునే సాంగ్స్ ఇవ్వలేని పరిస్థితి నేడు తలెత్తిందని, అటువంటిది అక్కడెక్కడో ముంబైలో ఉండే హిందీ వారికి మన టేస్ట్ ఎలా తెలుస్తుందని, దీన్నిబట్టి సాహోలోని అన్ని సాంగ్స్ ఇదే విధంగా ప్రేక్షకుడికి అర్ధం కాని రీతిలో గజిబిజిగా కంపోజ్ చేస్తే, అవే సినిమాకు కొంత మైనస్ గా మారే అవకాశం ఉందని కొందరు మీడియా మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు. 

అయితే ఈ విషయమై సినిమా విశ్లేషకులు స్పందిస్తూ, ఇదివరకు కొందరు బాలీవుడ్ సంగీత దర్శకులు సైతం తెలుగులో మంచి మ్యూజిక్ ఇచ్చి ఆకట్టుకున్నారని, అటువంటి వారిలో బప్పీలహరి, సందీప్ చౌతా వంటివారు ముందు వరుసలో ఉంటారని వారు గుర్తుచేస్తున్నారు. అందునా సాహో నుండి ఇప్పటివరకు కేవలం ఒక్క పాటే విడుదలైంది కాబట్టి, అది అందరికి నచ్చకపోయి ఉండచ్చు. అయితే సినిమాలోని మిగతా సాంగ్స్ కు బాగ్చి మంచి మ్యూజిక్ ఇచ్చి ఉండవచ్చును కదా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి సాహో సాంగ్స్ పూర్తి స్థాయిలో ఆడియన్స్ ని ఎంతవరకు అలరిస్తాయనేది తెలియాలంటే మాత్రం ఆ సినిమా ఆడియో విడుదల వరకు వేచి చూడాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: