టాలీవుడ్ అగ్ర నిర్మాత... టాప్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఏ సినిమా సక్సెస్ అయినా ముందే కరెక్ట్ గా అంచనా వేస్తాడు అన్న పేరుంది. టపటపా సినిమాలు తీస్తూ.. హిట్లు మీద హిట్లు కొట్టే దిల్ రాజు అటు డిస్ట్రిబ్యూషన్ రంగంలో అంతే ఖ‌చ్చితంగా హిట్ సినిమాలు కొంటూ తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. దిల్ రాజు ఒక సినిమా కొన్నాడు అనగానే అటు బయర్ల‌ లోనూ.... ఇటు ఆడియన్స్ లో ఆ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి.


అదే టైంలో టాప్ థియేటర్లో ఆ సినిమా రిలీజ్ అవుతుందన్న నమ్మకం కూడా నిర్మాతలకు ఉంటుంది. కొద్ది రోజులుగా సినిమాల సక్సెస్ను అంచనా వేయటంలో ఆయన కాలిక్యులేషన్స్ త‌ప్పుతున్నాయ‌న్న‌ టాక్ అయితే ఉంది. ఇందుకు కారణం రాజు తీస్తున్న సినిమాలు.... డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ‌ట్ మంటున్నాయి.


తాజాగా ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా విష‌యంలో రాజు పూరిపై న‌మ్మకం లేక బ్లండ‌ర్ మిస్టేక్ చేశాడు. ఈ సినిమా హోల్‌సేల్‌గా కొనేయమని దిల్‌ రాజుకి ఆఫర్‌ ఇచ్చాడు పూరి జగన్నాథ్‌. కానీ మెహబూబా అనుభవంతో ఈసారి పూరిని నమ్మలేదు రాజు. ఇప్పుడు సినిమా బంపర్‌ హిట్‌ అయింది. పూరి ఆఫర్‌ చేసిన రేటుకి కొన్నట్టయితే దిల్‌ రాజుకి కనీసం రెండింతలు లాభాలు వచ్చేవి. దీంతో ఇప్పుడు రాజు కూడా తాను చేసిన రాంగ్ స్టెప్‌కు ఫీల్ అవుతున్నాడ‌ట‌.



మరింత సమాచారం తెలుసుకోండి: