టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో నటించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. మహేష్‌తో నటించడం నా లక్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంటుంది. అయితే రష్మిక మందన్న ప్రస్తుతం మహేష్ సినిమాలో నటిస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో సరిలేరు నీకెవ్వరు సినిమాలో ప్రిన్స్‌తో జోడీ కట్టింది.
ఇక తన లక్కీ హీరో విజయ్ దేవరకొండతో నటిస్తోన్న డియర్ కామ్రేడ్ ఈ వారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో రష్మిక మహేష్‌తో ఛాన్స్‌పై చేసిన కామెంట్ టాలీవుడ్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. మహేష్‌తో నటించడం నేను లక్కీ అని అనుకోవడం లేదు. ఎలాంటి అవకాశాలైన హార్డ్ వర్క్ వల్లే వస్తాయి. నేను హార్డ్ వర్క్ చెయ్యడం వల్లే నాకు మంచి అవకాశాలు వస్తున్నాయని ఫీల్ అవుతున్నానని చెప్పింది.
వామ్మో ఛాన్స్ వచ్చే వరకు ఒకలా... ఛాన్స్ వచ్చాక మరోలా మాట్లాడుతోంది.. రష్మిక మహా గడుసరే అని ఇండస్ట్రీ వాళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ఇక సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ షెడ్యూల్ లో నా రోల్ కి సంబంధించి ఎలాంటి షూట్ లేదు. దాంతో మహేష్ గారితో కలిసి వర్క్ చేయలేకపొయాను. తరువాత షెడ్యూల్ లో ఆయనతో కలిసి నటించడానికి చాలా ఎగ్జైట్ గా ఉన్నానని చెప్పింది.