క్యాస్టింగ్ కౌచ్.. సినీరంగాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఇది. ఏ ఒక్క సినీరంగానికో పరిమితమైంది కాదు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్.. వుడ్ ఏదైనా ఆడవాళ్లకు లైంగిక వేధింపులు తప్పడం లేదు.


ఇప్పుడు ఈ అంశంపైనే ఏకంగా ఓ హీరోయిన్ సినిమా తీసింది. తైవాన్‌ నటి వూ కెసి తానే స్వయంగా కథ రాసి, నటించిన చిత్రం ‘నినా వూ’. సినీరంగంలో లైంగిక వేధింపులే ఈ సినిమా కథాంశం. తాజాగా విడుదలై అందరి ప్రశంసలు అందుకుంటోంది.


ఇందులో సినీరంగంలోని దారుణాలన్నీ కళ్లకు కట్టింది పూ కెసి. స్వయంగా తాను ఎన్నో లైంగిక వేధింపులు అనుభవించానని చెబుతోంది. నటీమణులు తమకు జరిగిన లైంగిక దాడులను ధైర్యంగా బయటపెట్టాలనేదే ఈ చిత్రం లక్ష్యమని ఈ హీరోయిన్ చెబుతోంది.


ఇదే సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను కూడా గుర్తు చేసుకుందీ హీరోయిన్.. ఓసారి షూటింగ్‌ సమయంలో దర్శకుడిని ప్రశ్నించినందుకు తనను 30 చెంపదెబ్బలు కొట్టించాడట ఆ డైరెక్టర్. స్క్రిప్టులో లేకపోయినా అప్పటికప్పుడు సీన్ క్రియేట్ చేసి మరీ తనను వేధించాడని గుర్తు చేసుకుంటోంది వూ కెసి.


మరింత సమాచారం తెలుసుకోండి: