ఒక్క వేటుతో ఎద్దుని ఆపగల బలమున్న భల్లాల దేవుడి కి ఏమైంది? ఎప్పుడూ యాక్టివ్ గా కూల్ గా ఈజీ గోయింగ్ గా వుండే ఎనర్జిటిక్ యాక్టర్ రానాకి ఏమైంది? అందరూ అనుకున్నట్టు రానాకి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిందా అందుకోసమే అమెరికా వెళ్లాడా? అసలు రానాకి ఏమైంది? 

రానా టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్ ని రౌండప్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. ఓన్లీ హీరోగానే సినిమాలు చేయాలి అని మడికట్టుకుని కూర్చోకుండా ఓన్లీ హీరోగా కెరియర్ వర్కౌట్ కాదని రియలైజ్ అయి స్టోరీడ్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఉన్నాడు సక్సెస్ అవుతున్నాడు. అందుకే బాలీవుడ్ లో కూడా రానాకి మంచి క్రేజ్ ఉంది.

ప్రస్తుతం హిరణ్య కశ్యప, హాథీ మేరే సాథీ, విరాట పర్వం సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇన్ని సినిమాలు చేతిలో ఉన్న రాణా ఈ మధ్య కనిపించటం లేదు. రానాకి రీసెంట్ గా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అయ్యింది. కొంతకాలం గా కిడ్నీ ప్రాబ్లమ్ తో సరఫరా అవుతున్న రానాకి ఇప్పుడు అమెరికా లో కిడ్నీ ఆపరేషన్ చేశారు.

 నాలుగు నెలల క్రితమే అమెరికా వెళ్ళిన రానాకి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అప్పుడే అవసరం లేదని మెడికేషన్ తో ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పారు. దాంతో మళ్లీ ఇక్కడ షూటింగ్ తో బిజీ అయ్యాడు రానా అయితే ఈ సమస్య పెద్దవడంతో ఇప్పుడు ఆపరేషన్ చెయ్యక తప్పలేదు. 

బాహుబలి సినిమా కోసం విపరీతం గా వెయిట్ పెరగడం తో పాటు ఫిజికల్ గా బాగా స్ట్రెయిన్ అయిన రానాకి అంతకు ముందే ఉన్న ఈ హెల్త్ ఇష్యూ కాస్త పెద్దది అయింది. 

ఇప్పుడు అది కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ వరకూ వచ్చింది. రానాని చూడడానికి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా వెళుతున్నారు. రీసెంట్ గా బన్నీ కూడా వెళ్ళడాని కి రెడీ అయ్యాడు కానీ  త్రివిక్రం సినిమా లో డేట్స్ ఎడ్జెస్ట్ అవ్వకపోవడంతో ఈ ప్రోగ్రామ్ పోస్టుపోన్ చేసుకోవాల్సి వచ్చింది.

 అంతేకాదు ఆల్రెడీ సాయిపల్లవి రాణా జంటగా తెరకెక్కిస్తున్నా విరాట పర్వం షూటింగ్ స్టార్ట్ అయి ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. రానా మళ్లీ షూటింగ్ కి రావాలంటే కనీసం నెల రోజులైనా టైం పడుతుందని డాక్టర్స్ సజెస్ట్ చేసాడట. సెకండ్ షెడ్యూల్ ఇప్పుడు రానా లేకుండానే ప్లాన్ చేశారు యూనిట్.


మరింత సమాచారం తెలుసుకోండి: