ఒక సినిమా రిలీజై అది బ్లాక్ బస్టర్ అయితే చాలామంది ఆ కథ నాదే. నా కథను కాపీ కొట్టారు అంటూ రచ్చ చేయడం మొదలు పెడతారు. సాధారణంగా ఒకే రకమైన ఐడియా చాలా మంది రచయితలకు, దర్శకులకు రావడం సహజం. క్రియోటివ్  ఫీల్డయిన ఫిల్మ్ ఇండస్ట్రీలో కథల విషయంలో ఇలా జరగడం చాలా కామన్. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ హాలీవుడ్ సినిమా కాపీ అని కొందరంటుంటే పూరీ మాత్రం ఇన్‌స్పైర్ అయ్యానని కథ తనదేనని ఎక్కడా కాపీ కొట్టలేదని ఈ మధ్యే క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ విషయాన్ని ఈ హీరో చూశాడో లేదో మళ్ళీ మొదటికే వచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాపై ఇప్పటికే పలు వివాదాలు నడిచాయి. ఈ సినిమా కథ తనదే అంటూ విడుదలకు ముందు కొంతమంది ఆరోపించారు. 

మరికొందరు ఈ సినిమా టోటల్ స్క్రిప్ట్ ను ఓ వెబ్ సైట్ లో పెట్టారు. ఇలాంటి వివాదాల నుంచి గట్టెక్కి సక్సెస్ ఫుల్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై ఇప్పుడు మరో వివాదం చెలరేగింది. ఈ సినిమా కాన్సెప్ట్ తనదే అంటున్నాడు ఆనందం హీరో ఆకాష్. "ఒక వ్యక్తి మెదడును హీరోకి మార్పిడి చేయడమనే కథతో 'ఇస్మార్ట్ శంకర్' వచ్చింది. ఇదే కాన్సెప్ట్ తో తెలుగు-తమిళ భాషల్లో నేను తయారుచేసిన కథ, కథనాలతో ఓ సినిమా చేశాను. అందులో నేనే హీరో. రాధ అనే మహిళా దర్శకురాలు సినిమా తీశారు. ఇది ఇప్పటికే తమిళంలో 'నాన్ యార్' పేరుతో రిలీజైంది. తెలుగులో రిలీజ్ చేయాలనుకుంటున్న టైమ్ కు ఇస్మార్ట్ శంకర్ వచ్చేసింది."

ఇలా తన కథను పూరి జగన్నాథ్  కాపీకొట్టేశాడని ఆరోపిస్తున్నాడు ఆకాష్. తన సినిమా తెలుగు వెర్షన్ కు "కొత్తగా ఉన్నాడు" అనే టైటిల్ ఫిక్స్ చేశానని, కానీ తనకు పూరి జగన్నాథ్  షాకిచ్చాడని అంటున్నాడు. ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో ఇస్మార్ట్ శంకర్ కథ రాసుకున్నానని పూరి జగన్నాథ్ ఇప్పటికే ప్రకటించాడు. అయితే తన కథ పూరీ కాపీ కొట్టాడని చెప్పడానికి ఆధారాలున్నాయా అని పూరీ ఫ్యాన్స్ ఆకాష్ కి కౌంటర్ ఇస్తున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: