సాధారణంగా సంక్రాంతికి భారీ సినిమాలు వస్తాయన్న సంగతి తెలిసిందే. అందులో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే డిసెంబర్ కూడా ఈ సారి టాలీవుడ్ కు ప్రత్యేకం కాబోతోంది. ఆఖరివారం నుంచి జనాలు సంక్రాంతి మూడ్ లోకి వెళ్లిపోతారు. సినిమాల మీద దృష్టి తక్కువ వుంటుంది. అందుకే ఇప్పుడు డిసెంబర్ 20 మీద నిర్మాతల దృష్టిపడింది. ప్రస్తుతం నిర్మాణంలో వున్న సినిమా మేకర్స్ అంతా డిసెంబర్ 20 ని టార్గెట్ గా పెట్టుకున్నారు. భీష్మ, ప్రతిరోజూ పండగే, డిస్కోరాజా సినిమాలు ఇప్పటికి ఈ డేట్ ను టార్గెట్ గా పెట్టుకున్నాయి. 

అలా పెట్టుకోవడం పెద్ద సమస్య కూడా కాదు. ఎందుకంటే ఇంకా అయిదు నెలల సమయం వుంది కాబట్టి ఆ సమయానికి సినిమాను రిలీజ్ చేసేయోచ్చు. ఒకవేళ ఇప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినా డిసెంబర్ 20 కి రిలీజ్ చేయచ్చు. అలాంటిది ఇప్పటికే భీష్మ, ప్రతిరోజూ పండగే సినిమా నలభైశాతం వరకు షూటింగ్ కంప్లీట్ అయిందని సమాచారం. రవితేజ-విఐ ఆనంద్ కాంబినేషన్ లోని సినిమా డిస్కో రాజా కూడా ఇప్పుడు ఈ డేట్ మీదే దృష్టిపెట్టింది. ముగ్గురు హీరోయిన్ల ఎంపిక, ఇతర సమస్యలతో కాస్త స్లోగా నడిచిన ఈ సినిమా ఇప్పుడు రవితేజకు వేరే ఆఫర్లు రావడంతో, స్పీడ్ అందుకుంది. 

ఈ సినిమాను ఫినిష్ చేసి, అజయ్ భూపతి సినిమాతో సెట్స్ మీదకు వెళ్లాలి . అలాగే గోపీచంద్ మలినేని సినిమా కాక, మరో రెండు సినిమాల మీద రవితేజ దృష్టిపెట్టారు. అందువల్ల డిస్కోరాజా స్పీడయింది. డేట్ ను ఆల్ మోస్ట్ లాక్ చేసుకున్నారట. ఇక నాగశౌర్య అశ్వద్ధామ, మైత్రీ మూవీస్ ఉప్పెన వంటి సినిమాల దృష్టి కూడా ఇదే డేట్ మీద వుందని తెలుస్తోంది. మరి ఈ డేట్ ను లాక్ చేసుకున్న సినిమాలు ఎన్ని హిట్ అవుతాయో ఎన్ని ఫట్ అవుతాయో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: