సాధారణంగా హీరోయిన్స్ తను  ఇచ్చిన కాల్షీట్స్ కంప్లీట్ చేసుకొని తన రెమ్యునిరేషన్ తీసుకొని వేరే ప్రాజెక్ట్ కి జంపవుతారు. కొంతమంది సినిమా రిలీజ్ అయ్యోవరకు ప్రమోషన్స్ కి సపోర్ట్ చేసి సినిమాను బాగా ప్రమోట్ చేస్తారు. ఈ విషయంలో సమంత అందరికంటే ముందుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సమంత కంటే కూడా చాలా రిస్క్ చేసిందట అమాలాపాల్. తను నటించిన సినిమా కోసం ఇంత చేసిందా అని అసలు విషయం తెలిసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారట. అమలాపాల్ హీరోయిన్ గా రీసెంట్ గా ఆమె  సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమల నటనకు విమర్షకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. 

అంతేకాదు కథ డిమాండ్ మేరకు దాదాపు 15 నిముషాల పాటు ఈ సినిమాలో నగ్నంగా నటించి పని పట్ల తనకున్న సిన్సియారిటీని చాటుకుంది. అందరూ ఇదే అమల చేసిన పెద్ద రిస్క్ అని అనుకున్నారు. కానీ ఇంతకంటే పెద్ద రిస్క్ మరోటి చేసిందని అది కూడా తప్పని పరిస్థితుల్లో అని రీసెంట్‌గా తెలిసింది. ఈ సినిమా విడుదల కోసం తన రెమ్యునరేషన్ వదులుకోవటమే కాదు.. తిరిగి ఎదురు డబ్బులు ఇచ్చిన ఆసక్తికరమైన విషయం  బయటకు వచ్చింది. సాధారణంగా ఒక సినిమాకు భారీ ఇమేజ్ వచ్చేసి.. ఆ సినిమా హక్కులు కొన్నవారంతా విడుదలకు వారాల ముందే తామివ్వాల్సిన డబ్బుల్ని ఇచ్చేసిన తర్వాత..దానికంటే సంతోషించాల్సిన విషయం ఇంకోటేముంటుంది.

అమలాపాల్ కారణంగా ఆమె సినిమాకు భారీ క్రేజ్ రావటమే కాదు.. విడుదలకు ముందే ఈ సినిమాకు వచ్చిన ప్రచారం అంతా ఇంతా కాదు. అమలాపాల్ కాకుండా మరే హీరోయిన్ నటించినా ఇంత క్రేజ్ వచ్చేది కాదు. ఇంత కష్టపడిన ఈ సినిమా.. రిలీజ్ చేసే సమయానికి నిర్మాత ఫైనాన్షియర్ల దగ్గర చేతులు ఎత్తేయటంతో.. తన రెమ్యునరేషన్ మొత్తాన్ని వదులుకోవటమే కాదు..తిరిగి ఎదురు డబ్బులు పెట్టి సినిమా విడుదల కోసం కష్టపడిన సంగతి రీసెంట్‌గా బయటకు వచ్చింది. ఇలాంటి రిస్క్ తీసుకొని సినిమా విడుదలకు కారణమైన అమలను చూసి ఇండస్ట్రీ మొత్తం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అంతే కదా మరి ఇలాంటి రిస్క్ ఏ హీరోయిన్ చేస్తుంది..! 


మరింత సమాచారం తెలుసుకోండి: