మొత్తానికి  'వినయ విధేయరామ' ప్లాప్ ఎఫెక్ట్  యాక్షన్ డైరెక్టర్  బోయపాటి శ్రీను పై బాగానే పడింది  ఎప్పుడూ వరుస ఆఫర్స్ తో  బిజీ బిజీగా ఉండే బోయపాటి,  ఆ సినిమా ప్లాప్ వల్ల చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.  ఎట్టకేలకూ  బోయపాటి - అల్లు అర్జున్ కాంబినేషన్ లో  అల్లు అరవింద్ నిర్మాణంలో  ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.  కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం  పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న  ఈ సినిమా నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.  ఏది ఏమైనా నవంబర్ నుండి  మళ్లీ నరుకుడే అన్నమాట.  


ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక  గతంలో  బోయపాటి - అల్లు అర్జున్ కాంబినేషన్ లో  వచ్చిన 'సరైనోడు' సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ ను అక్కడి జనాన్ని  బాగా ఆకట్టుకుంది.  మరి ఈ సారి కూడా వీరి కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.  అయితే బోయపాటి - బాలయ్య సినిమా కూడా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. కాకపోతే అల్లు అర్జున్  సినిమా తరువాత  వచ్చే ఏడాది బాలయ్యతో సినిమా ఉంటుందట.  


మరింత సమాచారం తెలుసుకోండి: