సాధారణంగా చాలామంది హీరోయిన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్ళి కాగానే సినిమాలకు దూరమవుతారు. అయితే తమిళంలో సూర్య బెటరాఫ్ జ్యోతిక మాత్రం రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ చేశారు. అందులో భాగంగానే రేవతి తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయమేమిటంటే కథ మొత్తం జ్యోతిక-రేవతి చుట్టే తిరుగుతుందట. వాస్తవంగా చూస్తే మన టాలీవుడ్ లో హీరోయిన్లు కాస్త ఏజ్ బార్ కాగానే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయిన వాళ్ళని చూస్తున్నాం. కానీ తమిళ్ లో మాత్రం మా రూటే సెపరేటు అనేలా ఉంటుంది. ఈ విషయం  జ్యోతిక, రేవతి లను చూస్తే అర్థమవుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందిన జాక్ పాట్ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ కోలీవుడ్‌లో సంచలనం రేపుతోంది.  

ఇద్దరు కిలాడీ మిడిల్ ఏజ్ లేడీస్ కలిసి మోసగాళ్లను బురిడీ కొట్టిస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఓసారి పోలీస్ లాగా మరోసారి డాక్టర్ ఇలా అవసరానికి తగ్గట్టు వీళ్ళు వేయని వేషం ఉండదు. మహిళలం అనే భయం ఏమాత్రం  లేకుండా మగరాయుళ్ళుతో ధీటుగా ఫైట్లు కూడా చేస్తుంటారు. అప్పుడే నేర సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఇద్దరు డాన్ల తో వీళ్లకు గొడవ మొదలవుతుంది. జైలుకు వెళ్తారు. అసలు ఈ ఇద్దరి వెనుక ఉన్న కథేంటి వీళ్లకు తగిలిన జాక్ పాట్ ఏంటి అనేదే అసలు కథ. 

ఈ ట్రైలర్ మొత్తం మాస్ అంశాలతో కట్ చేశారని తెలుస్తోంది. ఎక్కడ కాస్త అసభ్యత లేకుండా గ్లామర్ ప్రస్తావన రాకుండా అవుట్ అండ్ అవుట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో జ్యోతిక ఎప్పుడూ చూడని విధంగా విశ్వరూపంలో కనిపించగా రేవతిని ఎప్పుడో మౌన రాగం తర్వాత అంత హుషారుగా చూస్తుంది ఈ సినిమాలోనే. యాక్షన్.. ఎమోషన్.. సెంటిమెంట్ అన్ని అంశాలను సమానంగా జోడించినట్టు తెలుస్తోంది. స్టార్ లేకుండా కేవలం ఇద్దరు సీనియర్ ఆర్టిస్టులతో దర్శకుడు కళ్యాణ్ తెరకెక్కిన విధానం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. అంతేకాదు ఈ సినిమాకి జ్యోతిక భర్త సూర్య సోలో ప్రొడ్యూసర్ కావడం విశేషం. మరి ఈ సినిమా నిర్మాతగా సూర్య ఎంతవరకు సక్సస్ అవుతాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: