నిప్పు లేకుండా పొగ రాదు అంటారు.. కానీ.. ఈ నానుడి అన్ని రంగాలకూ పనికిరాదు. ప్రత్యేకించి సినీరంగానికి.. ఇక్కడ నిప్పే కాదు.. ఏమీ లేకుండానే పొగలే కాదు.. ఏకంగా మంటలే వస్తాయి.


సినీరంగంలో పుకార్లకు కొదవు లేదు. అలాంటిదే రామ్ చరణ్ పై వస్తున్న ఈ తాజా పుకారు కూడా. ఇంతకీ అసలు పుకారేంటో చెప్పలేదు కదూ. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా షూటింగ్ లో ఇప్పటికే ఓసారి గాయపడ్డ రామ్ చరణ్ మళ్లీ గాయపడ్డాడని పుకార్లు వచ్చాయి.


ఈ పుకార్లతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ఈ వదంతలు బాగా వ్యాపించడంతో ఆర్ ఆర్ ఆర్ సినిమా టీమ్ దీనిపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.రామ్ చరణ్ కు గాయాలు అయ్యాయనే వార్తల్లో ఏమాత్రం నిజంలేదని చిత్ర వర్గాలు తేల్చి చెప్పాయి. చెర్రీ ఆరోగ్య పరిస్థితి బాగుందని క్లారిటీ ఇచ్చాయి.


అంతేకాదు.. ఆయన సోమవారం, మంగళవారం షూటింగ్‌లో పాల్గొన్నారని కూడా వివరించాయి. ఈ సినీ బృందం వివరణతో మెగా ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: