'అర్జున్ రెడ్డి' సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. వరుస సినిమాలు చేస్తున్నా విజయ్ దేవరకొండ తన సినిమా ఎంపిక విషయంలో ఎవరు ఊహించని విధంగా ఫ్లాప్ డైరెక్టర్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఇండస్ట్రీలో ఉన్న అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. గతంలో ఇండస్ట్రీలో భారీ హిట్టు పడిందంటే సదరు హీరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్లు కె అవకాశాలు ఈస్తూ ఉండటం మనం చూశాం. అయితే తాజాగా మాత్రం విజయ్ దేవరకొండ ఎన్ని హిట్లు పడిన ఫ్లాప్ డైరెక్టర్లకు కొత్త డైరెక్టర్లకు మాత్రమే ఎక్కువ అవకాశాలు ఇవ్వడం వెనకాల ఒక మతలబు ఉన్నట్లు...భారీ ప్లాన్ విజయ్ దేవరకొండ వేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


విషయంలోకి వెళితే ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు దీటుగా తనకి క్రేజ్ మంచి పేరు రావడంతో ఆ పేరు ఏ మాత్రం పోకుండా బ్లాక్బస్టర్ డైరెక్టర్ ఇలా అయితే వారి చెప్పినట్లు తాను వినాలి సినిమా హిట్ అవుతుందో లేదో తెలియదు. ఈ క్రమంలో ఫ్లాప్ డైరెక్టర్ చెప్పిన కథ తనకు నచ్చితే స్టోరీ ఎంపిక నాటినుండి పోస్టర్ పైకి వెళ్లే వరకు అంతా తానై ఉండి సినిమా ముందుకు నడిపించాలని తన క్రేజ్ ఏమాత్రం పడకుండా ఉండాలని  ముందు నుంచే స్టోరీ చెప్పే డైరెక్టర్ల ఎంపిక నుండి సినిమా బయటకు వెళ్లే వరకు పకడ్బందీగా ప్లాన్ తో విజయ్ దేవరకొండ వ్యవహరిస్తున్నట్లు ఫిలిం నగర్ లో తెగ వార్తలు వినబడుతున్నాయి.


అంతేకాకుండా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో డైరెక్టర్ ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తాను చెప్పినట్లు చెయ్యాలి అన్నట్లు విజయ్ దేవరకొండ సదరు డైరెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నట్లు కూడా ఇండస్ట్రీలో టాక్. దీంతో విజయ్ దేవరకొండ ప్లాన్లు వింటున్న చాలామంది విజయ్ దేవరకొండ లాగా మరొకరు ప్లాన్ చేయలేరేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: