ఎన్నో అంచనాలతో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 తొలి ఎపిసోడ్ తోనే ఆ అంచనాలు అందుకుంది. మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి షో చేసిన అనుభవం ఉండటంతో నాగార్జున ఎక్కడా తడబడకుండా షోను నడిపించాడు. దీనికి తోడు గతంలోలా కాకుండా ఈసారి సెలబ్రిటీల విషయంలో కూడా బిగ్ బాస్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కువ మంది సెలబ్రిటీలు ప్రేక్షకులకు ఏదో ఒక విధంగా పరిచయం ఉన్నవారే కావడంతో ప్రేక్షకులు కూడా ఈ షోపై భారీగా ఆసక్తి చూపిస్తున్నారు.

 

కానీ ఒక్క విషయంలో మాత్రం బిగ్ బాస్ షో ఫెయిల్ అవుతుంది. బిగ్ బాస్ లాంటి షోలకు సస్పెన్స్ చాలా అవసరం. కానీ సోషల్, వెబ్ మీడియాలో బిగ్ బాస్ కు సంబంధించిన విషయాలు ముందే లీక్ అయిపోతున్నాయి. బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ కావడానికి కొన్ని రోజుల ముందునుండే బిగ్ బాస్ షోలో పాల్గొనేవారు వీరేనంటూ కొంతమంది పేర్లు వినపడ్డాయి. సోషల్ మీడియాలో ఏ పేర్లైతే వినిపించాయో వారే బిగ్ బాస్ షోలో పాల్గొనటం జరిగింది.

 

బిగ్ బాస్ సీజన్2 సమయంలో కూడా ఎలిమినేట్ అయ్యే సెలబ్రిటీలు ఎవరో ఒక రోజు ముందే సోషల్ మీడియాలో తెలిసిపోయేది. ఇలాంటి విషయాలు లీక్ కాకుండా బిగ్ బాస్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందే పేర్లు తెలిస్తే షోపై ప్రేక్షకుల్లో ఉత్సాహం తగ్గుతుంది. ఈ వారం ఎలిమినేషన్ కు ఆరుగురు ఎంపికయ్యారు. వితికా షేరు, జాఫర్, హిమజ, పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్, హేమ ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: