నిన్న ఉదయం నుండి హీరో రామ్ చరణ్ గురించి సోషల్ మీడియాలో ఓ గాసిప్ వినిపిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా రామ్ చరణ్ కు గాయం అయిందని ఆ గాయం వలన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ వాయిదా పడుతుందని ఆ గాసిప్ సారాంశం. గతంలో రామ్ చరణ్ కు ఒకసారి గాయం అవటంతో షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. మరోసారి ఇలాంటి వార్తలు రావటంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కంగారు పడ్డారు. 
 
కానీ వెంటనే ఆర్ ఆర్ ఆర్ యూనిట్ ఈ వార్తలపై స్పందించి ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చింది. రామ్ చరణ్ కు ఎలాంటి గాయం కాలేదని, రామ్ చరణ్ కు గాయం అయిందని వస్తున్న వార్త అబధ్ధమని ఆర్ ఆర్ ఆర్ సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీగా అంచనాలున్నాయి. ఈ సినిమా టీజర్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. 
 
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియాభట్ నటిస్తుండగా ఎన్టీయార్ కు జోడిగా అమెరికన్ హీరోయిన్ ఎమ్మా రాబర్ట్స్ నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి ఎమ్మా రాబర్ట్స్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్తో డీవీవి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు 66 కోట్లకు అమ్మినట్లు సమాచారం అందుతుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాను జులై 30 2020న విడుదల చేయబోతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: