బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ప్రారంభం కావడానికి ముందు ఈ షోను చాలా వివాదాలు చుట్టుముట్టాయి. యాంకర్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్ షోపై కాస్టించ్ కౌచ్ ఆరోపణలు చేయడంతో మొదలైన వివాదం పోలీష్ స్టేషన్, కోర్టుదాకా చేరింది. మరో సినీ నటి గాయత్రి గుప్తా తనను బిగ్ బాస్ నిర్వాహకులు 100 రోజులు సెక్స్ లేకుండా ఉండగవా అని అడిగారని బిగ్ బాస్ షో కోసం ఆరు సినిమాలు వదులుకున్నానని బిగ్ బాస్ నిర్వాహకులపై కేసు నమోదు చేసింది.

 

దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి బిగ్ బాస్ షో రాత్రి 11 గంటల తరువాత ప్రసారం చేయాలని, బిగ్ బాస్ షోకు సెన్సార్ చేసి ప్రసారం చేయాలని కోర్టులో ఫిటిషన్ వేసాడు. ఉస్మానియా విద్యార్థులు ఈ షోను ఆపాలని నాగార్జున ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించకూడదని నాగార్జున ఇంటిముందు ధర్నా చేసారు. ఇన్ని వివాదాలు బిగ్ బాస్ షోను చుట్టుముట్టడంతో ఒక దశలో ఈ షో ప్రారంభమవుతుందా లేదా అనే సందేహాలు కూడా వచ్చాయి.

 

కానీ బిగ్ బాస్ షో ప్రారంభమయ్యాక మాత్రం ఈ షోపై వివాదాలు ఆగిపోయాయి. ఒక రకంగా ఈ వివాదాల వలనే బిగ్ బాస్ షోపై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. చాలా ఛానెళ్ళలో సోషల్, వెబ్ మీడియాలో ఫ్రీగా బిగ్ బాస్ షోకు ప్రచారం లభించింది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు కూడా సెలబ్రిటీల మధ్య గొడవలు పెట్టేలా ఉండటంతో తొలి ఎపిసోడ్ నుండే బిగ్ బాస్ షో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ షోకు ఈసారి భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ వస్తాయని షో నిర్వాహకులు ఆశిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: