మరో రెండు రోజులలో విడుదల కాబోతున్న ‘డియర్ కామ్రేడ్’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ నేటి యంగ్ హీరోల తీరు పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. తన గెడ్డం తన లుక్ అనుసరించినంత మాత్రాన అందరూ విజయ్ దేవరకొండలు కాలేరనీ అని అంటూ చురకలు అంటించాడు. 

ఏ వృత్తిలో అయినా రాణించాలి అంటే నిజాయితీ ఉండాలని దానికితోడు సొంత తెలివి తేటలు ఉండాలి అని అవి ఏమీ లేకుండా కేవలం తనను అనుసరిస్తూ నటిస్తే ఫిలిం ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకుంటారు అంటూ విజయ్ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు. అంతేకాదు స్టార్ డమ్ ఇమేజ్ అన్న విషయాల పై తనకు నమ్మకం లేదనీ రాత్రికిరాత్రి ఏమైనా జరగవచ్చు అని అంటూ విజయ్ తన స్టార్ డమ్ పై తానే కామెంట్ చేసుకున్నాడు.

ఇదే ఇంటర్వ్యూలో మరొక ప్రశ్న పై స్పందిస్తూ తెలుగులో హిట్ అయిన తన సినిమాను  హిందీ భాషలో నటించమని తనకు ఆఫర్లు వచ్చినా తనకు ఇష్టం లేదనీ అందుకనే తాను అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో నటించే అవకాసం వచ్చినా వదులు కున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు తాను బాలీవుడ్ లో నటించవలసి వస్తే ఒక కొత్త కథతో నటిస్తాను కానీ చేసిన కథలోనే మరో భాషలో తీసే సినిమాలో నటించడం తనకు బోర్ అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. 

‘డియర్ కామ్రేడ్’ మూవీలో విద్యార్థి సంఘ నాయకుడుగా కనిపించే తాను కాలేజీలో చదివే రోజులలో కాలేజీ రాజకీయాలను పట్టించుకునే వాడిని కాదని అంటూ కాలేజీలో స్ట్రైక్ జరిగితే చాలు తాను ఎంజాయ్ చేస్తూ హాయిగా మార్నింగ్ షో సినిమాలకు వెళ్ళిపోయిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు తనకు కథలు నచ్చి నటించ లేకపోయిన కొన్ని సినిమాలను తాను వరసగా నిర్మించి అటు నిర్మాతగా ఇటు హీరోగా తన ప్రస్తావన కొనసాగిస్తాను అని అంటున్నాడు ఈ క్రేజీ హీరో..  



మరింత సమాచారం తెలుసుకోండి: