విజయ్ దేవరకొండ సినిమా అంటే ప్రతి ఒక్కరు ముందుగా మనసులో అనుకునేది ఆ సినిమాలో ఎన్ని ముద్దులు ఉంటాయి.  ఎలాంటి ముద్దులు ఉంటాయి అని.  మరికొందరైతే ఏకంగా ఆయన్ను టాలీవుడ్ ఇమ్రాన్ హస్మి అని పిలిచేస్తున్నారు. విజయ్ సినిమా అంటే ఎందుకు ముద్దులు ఉంటాయి.  


కేవలం ముద్దులు ఉంటేనే సినిమా ఆడదు.  ఆ విషయం అందరికి తెలిసిందే.  కాకపోతే.. సినిమాలో ముద్దులు ఉంటె మాస్, యూత్ ప్రేక్షకులు థియేటర్లకు వస్తుంటారు.  అందుకే సినిమాలో అలాంటి వాటిని పెట్టేందుకు ఆసక్తి చూపుతుంటారు.  


సినిమా అన్నది వ్యాపారం కాబట్టి, దానిక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి వీటిని అందులో జొప్పిస్తుంటారు. సినిమాకు అవి ప్లస్ అవుతుంటాయి.  అందుకే సినిమాలో ఇలాంటి వాటిని పెట్టేందుకు దర్శక నిర్మాతలు ఇష్టపడుతుంటారు.  


ముద్దు సన్నివేశాలు తీయాలంటే కొంచెం రిస్క్ తో కూడుకున్న పనులే.  సినిమా బాగుంది అంటే అవి ప్లస్ అవుతాయి.  ముఖ్యంగా అర్జున్ రెడ్డి తరువాత విజయ్ దేవరకొండ సినిమాలో ముద్దులు ఉన్నాయా లేదా అని చూసుకొని ప్రేక్షకులు సినిమాకు వస్తున్నారు.  ముద్దులు లేకపోవడమే నోటా ఫెయిల్ కు కారణం అని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: