అమలా పాల్ ఆమె సినిమా రిలీజ్ డేట్ కన్నా ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ అయ్యింది.  తెలుగులో ఫెయిల్ అయినా.. తమిళ్ లో సూపర్ సక్సెస్ అయ్యింది.  తెలుగులో ఆలస్యం కావడం ఫెయిల్యూర్ కు కారణం అంటున్నారు.  తమిళంలో సక్సెస్ కావడంతో అమలా పాల్ సెలెబ్రేట్ చేసుకుంటోంది.  


ఈ సెలబ్రేషన్ కూడా వెరైటీగా ప్రేక్షకుల మధ్యలో చేసుకోవాలని అనుకుంది.  వేషం మార్చింది.  ఎవరూ గుర్తు పట్టకుండా టీ షర్ట్ వేసుకొని, తలపై టోపీ పెట్టుకొని, సన్ గ్లాసెస్ పెట్టుకొని రిపోర్టర్ గా మారిపోయింది.  సినిమా చూసి వస్తున్న ప్రేక్షకులను ఆమె ఎలా ఉందంటూ ప్రశ్నించింది.  


పాపం ప్రేక్షకులు ఆమెను గుర్తు పట్టలేదు.  సినిమా బాగుందని అంటూ సమాధానం ఇచ్చారు.  ఈలోగా ఓ అభిమాని ఆమెను గుర్తు పట్టడంతో అంతా ఆమె చుట్టూ చేరారు.  సినిమా గురించిన కబుర్లను ఆమెనుంచి తెలుసుకున్నారు.  ప్రేక్షకుల నుంచి సమాధానాలు రాబడుతూ.. వాళ్లకు సర్ప్రైజ్ ఇచ్చింది అమలా పాల్.  


అమలా ఇందులో న్యూడ్ గా నటించి అందరిని మెప్పించింది. అలాంటి సాహసం  బహుశా ఎవరు కూడా సాహసించరు.  చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది ఇలా చేయాలి అంటే.  దర్శకుడు సినిమాను అద్భుతంగా తీశారని పొగిడేసింది.  భవిష్యత్తులో తిరిగి అతనితో పనిచేస్తానని చెప్తోంది అమలా. 


మరింత సమాచారం తెలుసుకోండి: