మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  నవంబర్ వరకు షూటింగ్ కంప్లీట్ చేయాలనీ టార్గెట్ గా పెట్టుకున్నారు.  సంక్రాంతికి వస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.  దిల్ రాజు సినిమా కాబట్టి సంక్రాంతికి తప్పకుండా వచ్చి తీరుతుంది.  


ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.  సెకండ్ షెడ్యూల్ ఈనెల 26 నుంచి ప్రారంభం కాబోతున్నది.  పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.  ఇదిలా ఉంటె వచ్చే సంక్రాంతికి మహేష్ తో పాటు అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా రాబోతున్నది.  ఈ సినిమాపై కూడా బోలెడు ఆశలు ఉన్నాయి.  


ఫాదర్ సెంటిమెంట్ తో సినిమా తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్ లో వస్తున్న సినిమా కాబట్టి క్రేజ్ ఉంటుంది.  ఈ రెండు సినిమాలు సంక్రాంతికి బరిలో ఉన్నాయి.  రెండు పెద్ద సినిమాలు.  రెండు రాష్ట్రాల్లోని థియేటర్లు వీరి చేతుల్లోనే ఉన్నాయి.  


కాబట్టి మిగతా సినిమాలు దాదాపుగా సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు పెద్దగా ఆసక్తి చూపవు.  నితిన్ భీష్మా, రవితేజ డిస్కోరాజా, సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండుగే సినిమా డిసెంబర్ లోనే రిలీజ్ కావాలని చూస్తున్నాయి.  సో, డిసెంబర్ మాసం అంతా మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ అవుతాయన్నమాట.  


మరింత సమాచారం తెలుసుకోండి: