విజయ్ దేవరకొండ లేటేస్ట్ మూవీ డియర్ కామ్రెడ్. చాలా అంచనాలు పెట్టుకున్న చిత్రం ఇది. ఇందులో విజయ్ చేసిన క్యారక్టర్ యూత్ ఇకాన్ లాంటిది. ఇందులో లవ్. ఎమోషన్లు, మాస్ కి కిర్రెక్కించే సీన్లు అన్నీ జబర్దస్త్ గా కుమ్మేసి ఫుల్ మీల్ ప్యాక్ గా రెడీ చేసి పెట్టారు.


డియర్ కామ్రేడ్ ఎల్లుండి  ధియేటర్లలోకి వస్తోంది. ఈ మూవీ హిట్ అంటున్నారు. ఇందులో హిట్ పెయిర్ విజయ్, రష్మిక ఉండడం, టీజర్ కి పాజిటివ్ బజ్ రావడం, విజయ్ ఈ  మూవీపై పెట్టుకున్న హోప్స్ అన్నీ చూస్తూంటే హిట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే ఈ మూవీ కనుక ఇపుడున్న సీజన్లో సరైన మూవీస్ ఏవీ  పోటీలో లేకపోవడం వల్ల బ్లాక్ బస్టర్ అయితే మాత్రం విజయ్ స్టార్ డం అందుకోవడం డ్యాం ష్యూర్.


అటు మాస్, ఇటు క్లాస్ రెండూ ఒడిసిపట్టి యూత్ ఫుల్ లవ్ స్టోరీలతో తన ట్రాక్ ని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న విజయ్ కి డియర్ కామ్రెడ్ మీద ఎంతో నమ్మకం ఉంది. ఈ మూవీ కనుక రికార్డులు తిరగరాస్తే ఇండస్ట్రీలో మరో సూపర్ స్టార్ హీరో వచ్చేసినట్లే. విజయ్ ఇంతవరకూ ఒక ఎత్తు, డియర్ కామ్రెడ్ తరువాత మరో ఎత్తు అంటున్నారు. డియర్ కామ్రెడ్ బ్లాక్ బస్టర్ అయితే టాలీవుడ్ లెక్కలే మారిపోతాయని కూడా అంటున్నారు. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: