తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి కేవలం సంవత్సర కాలంలో టాప్ హీరోయిన్ స్టేటస్ కు ఎదిగిన రష్మిక విషాద సన్నివేశాలలో నటించేడప్పుడు గ్లిజరిన్ వాడకుండా తన కంట కన్నీరు తెప్పించుకోగలదు అంటూ ఆమెను ప్రశంసిస్తూ ఉంటారు. ప్రస్థుతం టాప్ హీరోలు అందరు రష్మిక పై మనసు పడుతున్న నేపధ్యంలో ప్రస్తుతం ఈమె రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతూ చాల బిజీగా ఉంది అంటే ఆమె మ్యానియా ఏరేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది. 

మరో రెండు రోజులలో విడుదలకాబోతున్న ‘డియర్ కామ్రేడ్’ మూవీని ప్రమోట్ చేస్తూ ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ పై కొన్ని సెటైర్లు వేసింది. విజయ్ పేరు చెప్పగానే తాను సినిమాలో నటించడానికి ఒప్పేసుకుంటుంది అని వస్తున్న వార్తల పై స్పందిస్తూ తాను నటించే సినిమాకు సంబంధించిన కథ తన పాత్ర ఆమూవీని నిర్మించే బ్యానర్ తో పాటు తనకు నిర్మాతలు ఇచ్చే పారితోషికం ముఖ్యం కాని విజయ్ దేవరకొండ తనకు ముఖ్యం కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 

గత కొన్ని నెలలుగా తన సినిమాల షూటింగ్ ఒత్తిడి వల్ల సరిగ్గా నిద్ర కూడ ఉండటం లేదనీ తాను సమయానికి ఆహారం తింటున్నాన లేదా అన్న విషయం మరిచిపోయి తాను సినిమాలలో నటిస్తున్న విషయాన్ని వివరిస్తూ తన పై వచ్చే గాలి వార్తలను తాను పట్టించుకోను అంటూ కామెంట్ చేసింది. ఇదే సందర్భంలో ‘డియర్ కామ్రేడ్’ మూవీ కోసం తాను తన సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకున్న విషయాన్ని వివరిస్తూ ఈమూవీలోని తన డబ్బింగ్ కోసం 60 రోజులు కష్టపడిన విషయాన్ని వివరించింది. 

చాలామంది సినిమా నటులుగా రాణించడం సులువు అని అనుకుంటారని కానీ ఫిలిం యాక్టింగ్ అన్నది ఎంత కష్టమో తెలియాలి అంటే లిప్ లాక్ ల విషయంలో బూతు సెటైర్లు వేసినంత సులువు కాదు అంటూ తనను విమర్శించిన వారి పై ఘాటైన రివర్స్ పంచ్ వేసింది. గతంలో హీరో హీరోయిన్స్ మధ్య ముద్దు సన్నివేశాలు అనగానే పొదలు పువ్వులు అడ్డు పెట్టి చూపిస్తే జనం చూసారని మరి ఇప్పుడు అలా సభ్యతగా నటిస్తే జనం చూస్తారా అంటూ ప్రేక్షకులను ప్రశ్నిస్తోంది రష్మిక..



మరింత సమాచారం తెలుసుకోండి: