స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్-3 చుట్టూ ఇటీవల వివాదాలు ముసురుకున్నాయి. ఈ షో స్టార్ట్ చేయ‌డానికి ముందే ఆపేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు కూడా చెల‌రేగాయి. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున ఇంటి వద్ద ఇటీవల విద్యార్థి జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. 


ఈ వివాదాలు ఇలా ఉండ‌గానే ఈ షోకు ముందుగా త‌న‌ను ఎంపిక చేసి త‌ప్పించారంటూ యాంక‌ర్ శ్వేతారెడ్డి ఆందోళ‌న‌లు చేశారు. బిగ్‌బాస్-3 పేరుతో తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ యాంకర్ శ్వేతారెడ్డి ఇటీవల చేసిన ఫిర్యాదుకు బంజారాహిల్స్ పోలీసులు స్పందించారు. శ్వేతారెడ్డి ఫిర్యాదుపై విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు తాజాగా స్టార్ మా టీవీ కార్యాలయానికి వెళ్లి నోటీసులు అందజేశారు. 


ఈ నోటీసుల్లో ఛానెల్‌ యాజమాన్యానికి ఆరు ప్రశ్నలు సంధించారు. అగ్రిమెంట్‌ వ్యవహారం, ఎంపిక విధానం, నిబంధనలు, శ్యాం, మిగిలిన ముగ్గురి పాత్రకు సంబంధించిన ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. నోటీసులు అందుకున్న స్టార్‌ మా ఛానల్‌ సంస్థ అడ్మిన్‌ హెడ్‌ శ్రీధర్‌.. యాజమాన్యంతో మాట్లాడి రెండు రోజుల్లో సమాధానం ఇస్తామని పోలీసులకు తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: