ఛలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది రష్మికా మందన్నా. ఆ తరువాత రష్మిక నటించిన గీతా గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దేవదాస్ సినిమా యావరేజ్ అయినప్పటికీ మహేశ్ బాబులాంటి హీరోతో అవకాశం రావడంతో స్టార్ హీరోయిన్ గా మారింది రష్మిక. మరో రెండు రోజుల్లో విజయ్ దేవరకొండతో రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో రష్మిక చేసిన వ్యాఖ్యలు కన్నడ ఇండస్ట్రీలో సంచలనం అయ్యాయి. 
 
డియర్ కామ్రేడ్ సినిమా కోసం ఒక తమిళ వెబ్ సైట్ కు రష్మిక ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా కన్నడ భాషలో డబ్బింగ్ చెప్పటం చాలా కష్టమని, తాను కన్నడ భాష సరిగ్గా మాట్లాడలేనని చెప్పింది. కన్నడ భాషపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో శాండల్ వుడ్లో ఆమెకు అవకాశాలు ఇవ్వరాదని, కన్నడ సినిమాల్లో రష్మికను బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయంపై కర్ణాటక వాణిజ్య మండలి రష్మికకు సమన్లు జారీ చేయబోతుందట. 
 
కన్నడ సినిమాలతోనే కెరీర్ స్టార్ట్ చేసింది రష్మికా మందన్నా. తనతో నటించిన రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ కూడా రద్దు చేసుకున్న రష్మిక ఆ తరువాత కన్నడ సినిమాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు.తెలుగు బాగానే మాట్లాడుతున్న రష్మిక కన్నడ మాట్లాడలేదా అంటూ కన్నడిగులు రష్మికను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది రష్మిక. మరి రష్మిక చేసిన వ్యాఖ్యలపై కన్నడ చిత్ర మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: