స్ల‌మ్‌డాగ్ మిలియ‌నీర్ ఫేమ్ దేవ్ ప‌టేల్‌, హీరోయిన్ రాధికాఆప్టే న‌టించిన తాజా ఆంగ్ల చిత్రం ద వెడ్డింగ్ గెస్ట్ విడుద‌ల‌కు సిద్ధంకాగా, ఇందులోని ఓ హాట్ రొమాంటిక్ సీన్ లీకై  వైర‌ల్ అవుతోంది. ఈ సీన్‌లో రాధికా ఆప్టే, దేవ్ ప‌టేల్ న్యూడ్‌గా క‌నిపిస్తున్నారు. ఇక ఈ సీన్ లీక్ కావ‌డం పై రాధికా ఆప్టే తీవ్రంగా మండిపడింది.


స‌మాజంలో నెల‌కొనివున్న సైకోమెంటాలిటీ పెరిగిపోయింద‌ని చెప్ప‌డానికి ఈ సీన్ లీక్ కావ‌డ‌మే ఉదాహ‌ర‌ణ‌ని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. ఈ సీన్‌లో త‌న‌తోపాటు న‌టించిన దేవ్ ప‌టేల్‌కు బ‌దులుగా, త‌న‌ను మాత్ర‌మే టార్గెట్ ఎందుకు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించింది.


ఇటీవ‌లె ఓ మీడియాకి ముచ్చ‌టిస్తూ చెప్పిన విష‌యం ఆమె ఈ చిత్రంలో ఎన్నో మంచి సీన్స్‌లో న‌టించాన‌ని వాట‌న్నింటినీ వ‌దిలేసి, కేవ‌లం శృంగార దృశ్యాల‌ను మాత్ర‌మే లీక్ చేశార‌ని, ఇది ఎవ‌రో కావాల‌ని చేసిందేన‌ని వ్యాఖ్యానించింది. బోల్డ్ సీన్ల‌లో న‌టించేందుకు తానేమీ భ‌య‌ప‌డ‌బోన‌ని, చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలు చూస్తూనే పెరిగాన‌ని న‌టులు వేదిక పై న‌గ్నంగా న‌టించ‌డాన్ని కూడా తిల‌కించాన‌ని పేర్కొది. త‌న శ‌రీరాన్ని చూసి తానెందుకు సిగ్గుప‌డాల‌ని ప్ర‌శ్నించిన ఆమె, ఓ న‌టిగా అవ‌స‌ర‌మ‌నిపిస్తే ఎలాగైనా న‌టిస్తాన‌ని తెలిపింది||


మరింత సమాచారం తెలుసుకోండి: