విజయ్ దేవరకొండ రాబోయే చిత్రం డియర్ కామ్రేడ్  హిందీ రీమేక్ ను చిత్రనిర్మాత కరణ్ జోహార్ తీస్కున్నారు, ఈ చిత్రాన్ని మంగళవారం చూసిన ఆయన సోషల్ మీడియాలో జట్టును పొగడ్తలతో కూడిన పోస్టు పంచుకున్నారు. గతంలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సిరీస్ యొక్క హిందీ వెర్షన్‌ను అందించారు కరణ్ జోహార్.

డియర్ కామ్రేడ్ సినిమా చూసిన ఆయన  ప్రధాన తారలు విజయ్ మరియు రష్మిక మందన్న లను ప్రశంసించారు మరియు 'డియర్ కామ్రేడ్‌ను చూసిన మొదటి ప్రేక్షకుడిని నేను కావడం ఎంతో సంతోషంగా ఉంది, సినిమాలో చాలా ఉద్వేగంతో కూడిన ప్రేమకథ ఉంది  ' అదే పోస్ట్‌ చేశారు. కరణ్ జోహార్ ఈ చిత్రం యొక్క హిందీ రీమేక్‌ను నిర్మిస్తానని ప్రకటించాడు.



డియర్ కామ్రేడ్ యొక్క హిందీ రీమేక్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తాడా లేదా అని కరణ్ జోహార్ ప్రకటన స్పష్టం చేయలేదు. అయితే, మన అర్జున్ రెడ్డి  తన పోస్ట్‌లో "కామ్రేడ్ కరణ్ జోహార్, నాకు మీ పైన ఎంతో‌  గౌరవం‌ ఉంది. మీతో మరియు ధర్మ సినిమాలతో పనిచేయడానికి ఎక్కువకాలం వేచి ఉండలేను" అని రాశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: