‘ఇస్మార్ట్ శంకర్’ భారీ సక్సస్స్ తో మంచి జోష్ లో ఉన్న పూరి జగన్నాధ్  నిజంగానే ఫామ్ లోకి వచ్చాడా లేదంటే అదృష్టం కొద్ది హిట్ తగిలిందా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మీడియా మాత్రం పూరి జగన్నాథ్ ను హైలెట్ చేస్తూ అనేక ఆసక్తికర కధనాలు ప్రచురిస్తూనే ఉంది.   

‘ఇస్మార్ట్ శంకర్’ విజయంలో పూరి పాత్ర ఎంత అన్న విషయం పక్కకు పెడితే  గత కొన్నేళ్ళుగా సక్సస్ కోసం ఎదురు చూస్తూ ఉన్న పూరికి ‘ఇస్మార్ట్ శంకర్’ పెద్ద బూస్ట్ ఇచ్చింది.  దీనితో పూరి ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ రోజు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో   పూరి తన ఫ్యూచర్ ప్రాజక్టులపై మాట్లాడుతూ ఏకంగా చిరంజీవికి టార్గెట్ ఇస్తూ మాట్లాడటం చాలా మందిని ఆశ్చర్య పరిచింది.  

గతంలో నాలుగైదు సందర్భాలలో చిరును డైరెక్ట్ చేసే అవకాశాన్ని తాను మిస్ అయినట్టు వెల్లడించిన పూరి ఇప్పటికీ మెగాస్టార్ సినిమాకు  తాను   రెడీ అన్న సంకేతాలు ఇవ్వడం గమనార్హం. అంతేకాదు చిరంజీవి తనను ఇప్పటికైనా పిలిస్తే తాను చిరంజీవి కోసం ఐదు రోజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేసి డైరెక్ట్ చేసేందుకు రెడీగా ఉన్నాను అంటూ సంకేతాలు ఇచ్చాడు.  అంతేకాదు స్క్రిప్ట్ ను ఐదు రోజుల్లో పూర్తి చేసినా ఐదు నెలల సమయం తీసుకున్నా కంటెంట్ ముఖ్యం అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు.     

రెండు మూడేళ్ళ క్రితం పూరి చిరంజీవి కోసం ‘ఆటో జానీ స్క్రిప్ట్ ను రెడీ చేసిన సంగతి తెలిసిందే. చిరుకు సెకండ్ హాఫ్ సంతృప్తికరంగా అనిపించకపోవడంతో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు పూరి హిట్ ట్రాక్ లోకి వచ్చాడు కాబట్టి మళ్ళీ పూరి ఇస్తున్న సంకేతాలు చూసి చిరంజీవి పూరీకి మరో అవకాసం రానున్న రోజులలో ఇస్తాడో లేదో చూడాలి. చిరంజీవి మాత్రమేకాదు ప్రస్తుతం టాప్ హీరోలు ఎవరు మరో ఏడాది వరకు ఖాళీ లేని పరిస్థితులలో ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ అయినా పూరీకి కలిసి వచ్చిన విషయం ఏమిటి అంటూ కామెంట్స్ వస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: