అంతకముందే సినిమాల్లో పలు క్యారెక్టర్స్ పోషించినా... జబర్ధస్త్ కామెడీ షో ద్వారానే ఎక్కువగా పాపులర్ అయ్యాడు నటుడు అభి. అదిరే అభిగా పాపులర్ అయిన అభి... చాలాకాలం నుంచి సినీరంగంలో కొనసాగుతున్నాడు. జబర్ధస్త్‌లో కొనసాగుతూనే తనకు ఎంతో ఇష్టమైన డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌పై ఫోకస్ చేస్తున్న అభి... సినీ ఇండస్ట్రీలోకి రావడానికి తాను ఏ రకంగా కష్టపడ్డాననే విషయాలను ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ఈ క్రమంలోనే తన జబర్ధస్త్‌లో స్టార్‌గా కొనసాగుతున్న హైపర్ ఆదితో విభేదాలు అంటూ వస్తున్న రూమర్స్‌పై అభి క్లారిటీ ఇచ్చారు. 


హైపర్ ఆదికి తనకు మధ్య ఎలాంటి గొడవలు లేవని అన్నాడు అభి. తనతో విభేదాల కారణంగానే హైపర్ ఆది బయటకు వెళ్లిపోయాడన్న వార్తల్లో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చాడు జబర్ధస్త్ టీమ్‌లో మరో కొత్త టీమ్స్‌ను ఏర్పాటు చేయాలని ఆర్గనైజర్లు భావించారని అభి వివరించాడు. 


ఈ క్రమంలోనే అన్ని టీమ్స్‌లో సెకండ్ పొజిషన్ లో వున్న వాళ్లందరినీ కలిపి ఒక టీమ్‌ను తయారు చేశారని తెలిపాడు. అలా హైపర్ ఆది .. రైజింగ్ రాజు ..అంతా కలిసి ఒక టీమ్‌గా ఏర్పడ్డారని అన్నాడు. హైపర్ ఆది టీమ్ లీడర్ అయినందుకు... అతడు ఇంతలా సక్సెస్ అవుతున్నందుకు తాను సంతోషిస్తానని తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: