యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్రేకుల్లేకుండా దూసుకుపోతోంది. దీంతో నిర్మాత ఛార్మి, డైరెక్టర్ పూరి, హీరో రామ్ లు చాలా ఖుషీగా ఉన్నారు. ఈ ముగ్గురికి చాలా రోజుల త‌ర్వాత శంక‌ర్ రూపంలో మాంచి హిట్ ప‌డింది. ఇక ఈ సినిమా రామ్ కెరీర్ లో కలెక్షన్స్ పరంగా అల్ టైం హిట్ మూవీగా ఇస్మార్ట్ శంకర్  నిలిచింది.


ఈ ఆనందంలో ఉన్న నిర్మాత ఛార్మీ తాజాగా ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. మొత్తం 6 రోజుల‌కు ఇస్మార్ట్ శంక‌ర్‌ ప్రపంచ వ్యాప్తంగా 56 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని ఛార్మీ తెలిపింది.ఓవ‌ర్సీస్‌లో వ‌సూళ్లు త‌క్కువ‌గానే ఉన్నా ఏపీ, తెలంగాణ‌లో ఇస్మార్ట్ వ‌సూళ్లు మామూలుగా లేవు. బీ, సీ సెంట‌ర్ల‌తో అయితే ర‌చ్చ చేస్తోంది.


ఈ సినిమాను మొత్తం రూ.18 కోట్లు అమ్మ‌గా ఇప్ప‌టికే రూ.25 కోట్ల షేర్ మార్క్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే వ‌చ్చేసింది. ఈ వారం విజయ్ దేవరకొండ నటించిన “డియర్ కామ్రేడ్” విడుదల వరకు ఈ చిత్రానికి పోటీ లేకపోవడంతో మ‌రో రెండు రోజుల పాటు ఇస్మార్ట్ శంక‌ర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రిన్ని భారీ లాభాలు చూడ‌నుంది. ఇక కెరీర్‌లోనే భారీ హిట్ కొట్టిన రామ్ త‌న నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: