ఆ మద్య వరుసగా రెండు ఫ్లాపులు ఎదురు చూసిన నాని ఇటీవల రిలీజ్ అయిన జర్సీ తో సూపర్ హిట్ అందుకున్నాడు.  ఈ మద్య నాని ప్రయోగాత్మక పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  అసలే ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ అనిపించుకున్న నాని తన పాత్రలు సాధ్యమైనంత వరకు నేచురల్ గానే ఉండేలా చూసుకుంటున్నారు.


మనం ఫమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో నటిస్తున్నారు.  ఇటీవల దీనికి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి..  తాజాగా నాని ‘గ్యాంగ్ లీడర్’ టీజర్ రిలీజ్ చేశారు.  ఈ మూవీలో తన పేరు పెన్సిల్ అంటూ నాని వాయితో మొదలైంది.  అయితే తన ఇంటికి ఐదుగురు లేడీస్ వచ్చారు..వారి ఏజ్ లు, గెటప్ లు చూస్తుంటే..పుట్టుక నుంచి చావు దాక ఓ కంప్లీట్ సైకిల్ చూసినట్లే ఉంది..భలే ఉన్నారు లే అంటూ నాని డైలాగ్ ఫన్నీగా అనిపించినా దాని చుట్టే స్టోరీ ఉండబోతున్నట్లు కనిపిస్తుంది. 

అయితే ఈ సినిమాలో ఆ ఐదురు లేడీస్ ఏదో రివేంజ్ తీర్చుకోవడం ప్లాన్ లో ఉంటే..వారికి సపోర్ట్ గా నాని ఎంట్రీ ఇస్తున్నట్లు కనిస్తుంది. టీజర్ చివర్లో సీనియర్ నటి లక్ష్మీ ఓ కత్తి బయటకు తీయగా ఇదెక్కడిదీ అంటే సంవత్సరం నుంచి నా దగ్గరే పెట్టుకున్నానని చెప్పడంతో నావల్ల కాదు నన్ను రిలీజ్ చేయండో అంటు నాని అనడం చూస్తుంటే ఈ చిత్రం నవ్విస్తూనే థ్రిల్లింగ్ గా కనిపించబోతున్నట్లుంది.  జర్సీ విజయం తర్వాత నాని మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: